Samantha Ruth Prabhu.. సమంత పట్టిందల్లా బంగారమే అవుతోందిప్పుడు.! ‘ఊ అంటావా మావా..’ అంటూ సమంత ‘పుష్ప’ సినిమా కోసం చేసిన స్పెషల్ ఐటమ్ నెంబర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే కదా.!
అంతకన్నా ముందు ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ కూడా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. అసలు దాని వల్లనే సమంత – నాగచైతన్య మధ్య అభిప్రాయ బేధాలొచ్చి ఇద్దరూ విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరిగింది.
సరే, విడాకుల వ్యవహారం ముగిసిన అధ్యయం. నాగచైతన్య, సమంత.. వేరుపడ్డారు. తమ తమ సినిమాల్లో బిజీగా వున్నారు. అయినాగానీ, సమంతని నాగచైతన్య అభిమానులు తీవ్రంగా ట్రోల్ చేయడమైతే ఆగడంలేదు.
Samantha Ruth Prabhu.. ట్రోల్ చేసుకుంటారా.? మీ ఖర్మ.!
ఎవరెంతలా ట్రోల్ చేసినా, సమంత మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలో సంచలన విజయాల్ని అందుకుంటోంది. నిజానికి, ‘కెఆర్కె’ సినిమా తెలుగులో పెద్ద ఫ్లాప్.
చిత్రమేంటంటే, తమిళంలో ‘కెఆర్కె’ మంచి విజయాన్నే అందుకుంది. ‘ఎవరెన్ని అబద్ధాలు ప్రచారం చేసినా చివరకు నిజమే గెలుస్తుంది..’ అంటూ ‘కెఆర్కె’ విషయమై పరోక్షంగా నాగచైతన్య అభిమానులకి సమంత చురకలంటించేసింది.

‘కెఆర్కె’ సినిమాలో ‘ఖతీజా’ పాత్రలో సమంత నటించిన సంగతి తెలిసిందే. సమంతకి కామెడీ అంటే చాలా చాలా ఇష్టం. ఆ విషయం గతంలోనే ఆమె చెప్పింది.
‘కెఆర్కె’లో తనకిష్టమైన పాత్రను ఇచ్చిన దర్శకుడికి పదే పదే థ్యాంక్స్ చెబుతూ వస్తోంది సమంత.
‘థ్యాంక్ష్ డైరెక్టర్.! నాకు చెప్పినదాని కంటే సినిమా బాగా తీశారు. నా పాత్ర తొలుత విన్నదానికంటే అద్భుతంగా వచ్చింది..’ అంటూ దర్శకుడు విఘ్నేష్ శివన్‌కి సమంత థ్యాంక్స్ చెప్పింది సోషల్ మీడియా వేదికగా.
సమంత.. లక్కు తోక తొక్కేసిందంతే.!
ఇదిలా వుంటే, సమంత నటిస్తోన్న ‘యశోద’ సినిమా నుంచి గ్లింప్స్ ఒకటి విడుదల కాగా, అది కూడా వైరల్ అయ్యింది. మరోపక్క, సమంత నటించిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా ఇది.
Also Read: కాలు తొక్కిన రంభ.! మొహమ్మీద కొట్టిన కీర్తి సురేష్.!
సమంత – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎలా చూసుకున్నా, విడాకుల తర్వాత సమంత ‘సుడి’ మామూలుగా తిరగట్లే.! ఓ రేంజ్లో ఆమె పేరు మార్మోగిపోతోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా హయ్యస్ట్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి సమంత చేరుకుంది. ఫెయిల్ అనుకున్న సినిమా హిట్టవడం.. హీరోయిన్గా కెరీర్లో అత్యున్నత స్థానానికి చేరుకోవడం.. లక్కు తోక తొక్కడమంటే ఇదే మరి.!