మాస్ అమ్మ మొగుడు.! ఎన్టీయార్‌కే ధమ్కీ ఇచ్చినవ్.!
Jr NTR Vishwak Sen Mass Amma Mogudu
Mass Amma Mogudu NTR విశ్వక్ సేన్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’.! ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది.
మార్చి 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 17న ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
విశ్వక్ సేన్ (Mass Ka Das Vishwak Sen) అంటేనే అతి.! అలాంటిది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం వేసిన పోస్టర్‌లో ఆ ‘అతి’ లేకపోతే ఎలా.? అతి మామూలుగా లేదు.. ఇది ఈసారి వేరే లెవల్.!
Mass Amma Mogudu NTR.. ఈ అమ్మ మొగుడు గోలేంటి.?
‘మాస్ అమ్మ మొగుడు ఎన్టీయార్’ అంటూ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ ‘అమ్మ మొగుడు’ భాషేంటి.? రాజకీయ నాయకుల్ని సినీ జనాలు ఆదర్శంగా తీసుకుంటున్నట్టున్నారు.!
మాస్ పిచ్చి బాగా ముదిరిపోయింది.!
దీన్ని మద పిచ్చి అని కూడా అనొచ్చేమో.!
రాజకీయ నాయకులే అనుకుంటే.. అంతకు మించి దిగజారిపోతున్నారు సినీ జనాలు.!
మాస్ కా దాస్.. నీ బూతుల పైత్యం ఎన్టీయార్ మీద రుద్దుతావా.?
Mudra369
పెద్ద అక్షరాలతో ‘మాస్ అమ్మ మొగుడు ఎన్టీయార్’ అని వేసి, చిన్న స్క్రిప్టులో ‘తెలుగు ప్రైడ్’ (Telugu Pride NTR) అంటూ పేర్కొనడం గమనార్హం.
ఇదా పద్ధతి.? ఆస్కార్ సాధించుకొచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) బృందంలో జూనియర్ ఎన్టీయార్ కీలక సభ్యుడు. నిజంగానే, ఎన్టీయార్ అంటే ఇప్పుడు తెలుగు ప్రైడ్.!
తెలుగు ప్రైడ్.. పరువు తీసేశావ్.!
ఆ తెలుగు ప్రైడ్‌ని కాస్తా, ‘మాస్ అమ్మ మొగుడు’గా మార్చేశారు విశ్వక్ సేన్ (Mass Ka Das Vishwak Sen) అండ్ టీమ్. కాస్త మాస్‌గా వుంటుంది గనుక.. ‘మాస్ అమ్మ మొగుడు’ అనేశారేమో.!

కానీ, వినడానికి ఇది చాలా చాలా అసహ్యంగా వుంది. అయినా, విశ్వక్ సేన్ (Mass Ka Das Vishwak Sen) ఇలాంటివి కేర్ చెయ్యడు.
Also Read: Anasuya Bharadwaj.. పైకెక్కి కైపెక్కించిన అన‘సోయగం’.!
తన సినిమా ప్రమోషన్ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతాడు.! ఈ సారి విశ్వక్ సేన్ (Mas Ka Das Viswak Sen) ఇంకాస్త లోతుగా దిగజారిపోయాడంతే.!
జాగ్రత్త ఎన్టీయారూ.. (NTR Goes Global) తెలుగు ప్రైడ్ అనిపించుకున్నావ్.. ఇలాంటి పొగడ్తలతో నీ ఇమేజ్ దిగజారిపోవచ్చు.!