Table of Contents
Devi Nagavalli Vishwak Sen Row.. ఓ ప్రముఖ న్యూస్ చానల్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తోన్న దేవి నాగవల్లి, బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా కూడా అందరికీ సుపరిచితురాలే.
తెలుగు న్యూస్ ఛానళ్ళ రంగంలో సంచలనంగా మారిన ప్రముఖ న్యూస్ ఛానల్‌లో ఎన్నో ఏళ్ళుగా దేవి నాగవల్లి పనిచేస్తోంది. జర్నలిస్టుగా గుర్తింపు సంపాదించుకుంది కూడా.
న్యూస్ ప్రెజెంట్ చేసే క్రమంలో ‘అతి’ చేయడం జర్నలిస్టులకి సర్వసాధారణమైపోయింది.. అది ఏ న్యూస్ ఛానల్ అయినా. సినీ సెలబ్రిటీలు కావొచ్చు, పొలిటికల్ లీడర్లు కావొచ్చు.. చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు జర్నలిస్టులు చేసే అతి అంతా ఇంతా కాదు. దేవి అందుకు అతీతమేమీ కాదు.
Devi Nagavalli Vishwak Sen Row.. రుధిర పాత్రికేయం.!
‘రుధిర జర్నలిజం’ అంటూ ఆ మధ్య దేవి నాగవల్లి మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఛానెల్ టీఆర్పీ రేటింగ్ పెంచే క్రమంలో సరికొత్త పదాల్ని చాలా వికృతంగా ప్రదర్శించడం జర్నలిస్టులు అలవాటు చేసుకున్నారు. ఈ విసయంలో దేవి రెండాకులు ఎక్కువే చదివింది.
విశ్వక్ సేన్ ఓ సాధారణ చిన్న నటుడు. పెద్ద స్టార్ హీరో ఏమీ కాదు. అతనితో పంచాయితీ ఎందుకు.? చిన్నోడే కాబట్టి, ‘గెటౌట్’ అనేయగలిగిందా.? అనేసి వుండొచ్చు. ఆ తర్వాత జరిగే రచ్చ ఏంటో ఆమె ఊహించకుండా వుంటుందా.?

విశ్వక్ సేన్ సొంతంగా సినిమా తీసుకోగలడు. దేవి నాగవల్లి సొంతంగా న్యూస్ ఛానల్ పెట్టలేదు కదా.? మరెందుకు ‘గెటౌట్’ అనేయడం.!
మంత్రుల దగ్గరకు వెళ్ళి ఫిర్యాదులు చేయడం వంటివి జరిగిపోయాయ్. అలాంటి ఫిర్యాదుల వల్ల ఏం జరుగుతుందో తెలియనంత అమాయక జర్నలిస్టు అయితే కాదు దేవి నాగవల్లి.
ఈ వివాదంతో దేవి నాగవల్లికి ఏం లాభం.?
హత్యలు చేసినోళ్ళకే తేలిగ్గా బెయిల్ వచ్చేస్తున్న రోజులివి. అలాంటిది, ఆవేశంలో మాట తూలిన విశ్వక్ సేన్‌ని వదిలి పెట్టేది లేదని దేవి నాగవల్లి అంటే, అది హాస్యాస్పదం కాకుండా వుంటుందా.?
తాను పనిచేస్తున్న ఛానల్ సీనియర్ జర్నలిస్టులెందరో అకారణంగా ఉద్యోగం నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ‘వాటాలు’ కలిగిన జర్నలిస్టులు సైతం, సంస్థని వీడాల్సి వచ్చింది.
సినీ తారల్లో కొందరు పబ్లిసిటీ కోసం నానా రకాల పిల్లిమొగ్గలూ వేస్తుంటారు. అలాంటి పబ్లిసిటీ స్టంట్లు కొన్నిసార్లు వాళ్ళ కెరీర్‌కి ఉపయోగపడుతుంటాయ్ కూడా.
జర్నలిజం వేరు, సినిమా వేరు.!
జర్నలిజం లెక్కలు వేరు.. దానికున్న బాధ్యత, పవిత్రత వేరు. ఈ తరహా వివాదాలతో వచ్చే పబ్లిసిటీ కెరీర్ మీద తీవ్రంగా దెబ్బ కొడుతుంది.
గతంలో అనసూయ ‘ఫ’ మాట మాట్లడినప్పుడు, అదేదో అద్భుతమన్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి, విశ్వక్ సేన్ విషయంలో ఇంకోలా ఎలా వ్యవహరించావ్.? అన్న ప్రశ్నకు దేవి ఏం సమాధానం చెప్పగలదు.?
సినిమా వేరు, జర్నలిజం వేరు. బిగ్ బాస్ పుణ్యమా అని, గ్లామర్ రంగంతో పరిచయం కాస్త కలగడంతో ఆ పబ్లిసిటీ పోకడల వైపు ఆకర్షితురాలైతే.. అంతే సంగతులు.!
Also Read: సంస్కారమట.. ‘బోల్డు’గానే సెప్పాలట.?
తారల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం జర్నలిజానికి అలవాటే. అదే తారలూ, జర్నలిస్టుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ విషయమై ఇప్పటికే దేవి సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీని సంపాదించేసుకుందనుకోండి.. అది వేరే సంగతి.
విశ్వక్ సేన్ సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ వచ్చేసింది.. విశ్వక్ సేన్ పబ్లిసిటీ స్టంట్స్ ఫలించాయ్.. సినిమాకి ఓ మోస్తరు విజయం దక్కింది. మరి, దేవి నాగవల్లి మాటేమిటి.? ఈ వివాదం వల్ల ఆమెకు ఒరిగిందేంటి.? ప్చ్ జీరో.!