Table of Contents
Sarkaru Vaari Paata Records కంటెంట్ వున్న సినిమాలు ఫ్లాప్ అవడం, కంటెంట్ లేని సినిమాలు హిట్టవడం కొత్తేమీ కాదు.
సూపర్ హిట్ టాక్‌తో మొదలై, డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలున్నాయ్.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుని, సూపర్బ్ వసూళ్ళు సాధించిన సినిమాలకూ కొదవ లేదు తెలుగు సినీ పరిశ్రమలో.
ఇప్పుడిదంతా ‘సర్కారు వారి పాట’ సినిమా గురించే.! మహేష్‌బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కారు వారి పాట’ సినిమాకి తొలి రోజు డిజాస్టర్ టాక్ వచ్చింది.
Sarkaru Vaari Paata Records.. దెబ్బ కొట్టింది మహేష్ అభిమానులే.!
‘మా మహేష్‌బాబుని దర్శకుడు పరశురామ్ సరిగ్గా చూపించలేదు.. హీరోయిన్ కీర్తి సురేష్ ఐరన్ లెగ్గు కారణంగానే సినిమా డిజాస్టర్ అయ్యింది.. నేపథ్య సంగీతం విషయంలో మహేష్‌ని తమన్ మోసం చేశాడు..’ ఇలా సాగింది మహేష్ అభిమానుల ఆవేదన.
Also Read: ఏంటి దేవీ మరీనూ.! విశ్వక్ సేనుడి ‘రగడ’తో ఏం సాధించినవ్.!
‘సర్కారు వారి పాట’ సినిమాకి సంబంధించి ఫస్ట్ రివ్యూలు వచ్చింది మహేష్ అభిమానుల నుంచే. అవీ డిజాస్టర్ రివ్యూలే.
‘మహేష్ చాలా బాగా చేశాడు.. పరశురామ్ (Director Parasuram), తమన్ (Music Director Thaman), కీర్తి సురేష్ (Keerthy Suresh) దెబ్బ కొట్టారు’ అని తేల్చేసిందీ వాళ్ళే.

కానీ, రెండో రోజు సీన్ మారిపోయింది. సోషల్ మీడియాలో ‘డిజాస్టర్ సర్కారు వారి పాట’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయ్యేసరికి, మహేష్ అభిమానులు నొచ్చుకున్నారు.
డిజాస్టర్ నుంచి సూపర్ హిట్ వరకూ.!
ఇక, అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. సినిమాని హిట్టు.. అనేశారు. ఆ తర్వాత సూపర్ హిట్‌గా డిక్లేర్ చేసేశారు. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి.. ఆ వేదికపై సూపర్ స్టార్ మహేష్ డాన్సులు కూడా చేశాడు.
ఎలాగైతేనేం, డిజాస్టర్ అనుకున్న సినిమా.. 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది షేర్ పరంగా. రికార్డు వేగంలో ఓ రీజినల్ ఫిలిం సెంచరీ క్లబ్బులో చేరిందనే ప్రచారం ఊపందుకుంది.
ఓవర్సీస్లో 2 మిలియన్ల క్లబ్బులో మహేష్ (Super Star Maheshbabu) మరోమారు సత్తా చాటాడు. సో, ‘సర్కారు వారి పాట’ సినిమా సూపర్ హిట్టే.!
Also Read: పొలిటికల్ జామకాయ: ఇచ్చట కోసి కారం పెట్టబడును.!
మొత్తమ్మీద, ‘సర్కారు వారి పాట’ సినిమా థియేట్రికల్ రైట్స్ 130 కోట్ల దాకా అమ్ముడైన దరిమిలా, ఆ ఫిగర్ చేరుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పనేలేదు.
సినిమా గట్టెక్కిందిగానీ.! ఈ లెక్కలేంటి సామీ.!
అయితే, ఈ క్రమంలో మేకర్స్ చెబుతున్న ఫిగర్స్ విషయంలో అనుమానాలు మాత్రం బలంగా వ్యక్తమవుతూనే వున్నాయి.
ఇప్పుడున్న టిక్కెట్ల ధరలు, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద కనిపిస్తున్న వాతావరణం.. వీటికీ, ‘సర్కారు వారి పాట’కు సంబంధించి చెబుతున్న లెక్కలకీ పొంతన ఏమన్నా వుందా.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు.?
అన్నట్టు, ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమాని లేపే క్రమంలో, ఓ రాజకీయ పార్టీపై నిందలేశారు, వేరే హీరోల మీద ఆరోపణలు చేశారు.. ఓ ఛానల్ మీద కూడా మండిపడ్డారు మహేష్ అభిమానులు.
Also Read: Kangana Ranaut.. వామ్మో.! ఏం తెలివి.? క్లీన్ బౌల్డ్ చేసేస్తోందే.?
ఇదంతా పద్ధతి ప్రకారం జరిగిన పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చా.? అభిమానుల సెంటిమెంట్లతో ఆడుకుని, సినిమాకి లబ్ది చేకూర్చుకునేలా చేసిందెవరబ్బా.?
ఇంకో రాజకీయ పార్టీ ఎందుకు ‘సర్కారు వారి పాట’ సినిమాని తన భుజాన మోసిందబ్బా.?