‘వకీల్ సాబ్’ (Vakeel Saab Pawan Kalyan To Create New History)సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి, గత ఏడాది.. అంటే, 2020లో రావాల్సిన సినిమా. కరోనా పాండమిక్ నేపథ్యంలో సినిమాల షూటింగులే కాదు, సినిమాల విడుదల కూడా ఆగిపోవాల్సి వచ్చింది.
ఎలాగైతేనేం, లాక్ డౌన్ హంగామా తగ్గి.. పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చి.. తిరిగి సినీ పరిశ్రమ కాస్త ఊపిరి పీల్చుకుంది. మళ్ళీ పిడుగులాంటి వార్త.. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయ్ అని. తెలంగాణలో స్కూళ్ళు బంద్ అయ్యాయి. థియేటర్లనూ మూసెయ్యాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
రేపో మాపో సినిమా థియేటర్ల విషయమై కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతోందన్న ప్రచారం నడుమ, సినీ పరిశ్రమలో అలజడి మొదలైంది.
‘అరణ్య’ (Aranya) హిందీ వెర్షన్ విడుదల వాయిదా పడింది. తెలుగులో ‘అరణ్య’తోపాటు చాలా సినిమాలు ఈ నెలలో విడుదల కావాల్సి వున్నాయి. అందులో ‘రంగ్ దే’ (Rang De) కూడా ఒకటి.
ఇక, ఏప్రిల్ 9న విడుదల కావాల్సిన ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమా పరిస్థితేంటి.? ‘మ్యజికల్ ఫెస్టివల్’ అంటూ సినిమా ప్రమోషన్లను ‘వకీల్ సాబ్’ టీమ్ ముమ్మరం చేసింది. మరోపక్క, 50 శాతం ఆక్యుపెన్సీ.. థియేటర్లకు తాత్కాలికంగా తాళాలు.. అన్న అనుమానాలతో పవన్ కళ్యాణ్ అభిమానులు డీలాపడ్డారు.
సందట్లో సడేమియా.. అంటూ ఓటీటీ ప్రచారాలు తెరపైకొచ్చాయి. ఇప్పుడేం చేస్తుంది ‘వకీల్ సాబ్’ (Vakeel Saab Review) టీమ్. ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘వకీల్ సాబ్’ ఒక్కటే కాదు, చాలా సినిమాలు రిలీజ్ కోసం క్యూ కట్టేశాయి. వాటి పరిస్థితేంటి.?
మిగతా సినిమాలన్నిటితో పోల్చితే ‘వకీల్ సాబ్’ చాలా చాలా స్పెషల్. ఎందుకంటే, రాజకీయాల్లో బిజీ అయిపోయాక సినిమాలే చేసేది లేదని తేల్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Vakeel Saab Pawan Kalyan To Create New History), మళ్ళీ ‘పవర్ స్టార్’గా అభిమానుల్ని అలరించేందుకు ‘వకీల్ సాబ్’ సినిమా చేశారు.
దాంతో, ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా చాలా స్పెషల్. వసూళ్ళ పరంగా టాలీవుడ్ గత రికార్డుల్ని తమ అభిమాన హీరో సినిమా బద్దలుగొట్టేయాలని ఎదురుచూస్తోన్న అభిమానుల ఆశల్ని కరోనా ఇంకోసారి చిదిమేస్తుందా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.