Samantha Ruth Prabhu Styling.. సినిమా హీరోయిన్ల అందాల ప్రదర్శన కొత్తేమీ కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ నడుస్తోంది ఈ వ్యవహారం.
అప్పట్లో క్యాబరే డాన్సుల పేరుతో గ్లామర్ షో నడిచేది, ఇప్పుడు హీరోయిన్లు అందుకు ఏమాత్రం తగ్గకుండా ‘షో’ చేస్తున్నారు. నిజానికి, వెండితెరపై గ్లామర్ షో అనేది తప్పనిసరి ‘కమర్షియల్ ఎలిమెంట్’ అయిపోయింది.
పెళ్ళయ్యింది కాబట్టి.. ఆ పెళ్ళిని పెటాకులు చేసేసుకుంది కాబట్టి, సమంత ఎట్టి పరిస్థితుల్లోనూ ‘గ్లామర్ షో’ చెయ్యడానికి వీల్లేదంటున్నారు కొందరు. ఇదెక్కడి పంచాయితీ.? అంటున్నారు సమంత అభిమానులు.
వెరసి, సమంత పేరుతో సోషల్ మీడియా వేదికగా నానా యాగీ జరుగుతోంది గత కొంతకాలంగా.

తాజాగా, ఇంకోసారి ఈ వివాదం మరింత రాజుకుంది. అందుక్కారణం సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేసిన తాజా ఫొటోలే.
Samantha Ruth Prabhu Styling.. సమంత తప్పేమున్నదబ్బా.?
ఆయా ప్రోడక్టులకు ప్రచారం నిర్వహించే క్రమంలో, అందకు తగ్గట్టుగానో.. అవసరానికి మించి అందాల విందు చేయడమో.. అందాల భామలకు కొత్తేమీ కాదు. సమంత చేస్తున్నదీ అదే.
అందం చూసి ఆస్వాదించాలేగానీ.. ఈ విమర్శలేంటి.? అనేవారు ఓ వైపు, ‘నాన్సెన్స్.. సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు.?’ అంటూ ఇంకొందరు.. వెరసి, సమంత పేరు చెప్పి సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారంతే.!

సమంత మాత్రం, ఈ గ్లామర్ షోతో తన క్రేజ్‌ని మరింత పెంచుకుంటూనే వుంది. ఆమె డ్రస్సింగ్ స్టైల్ ఆమె ఇష్టం. కాదనడానికి ఎవరికి హక్కు వుందట.? అన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది.
ఊ అంటారా.! ఊహూ అంటారా.?
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరానే తీసుకుంటే, పెళ్ళయ్యింది.. పిల్లలున్నారు.. భర్త నుంచి విడిపోయింది. తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో వుంది.
ఐదు పదుల వయసులోకి వచ్చేస్తున్నా, గ్లామర్ షో విషయం తగ్గేదే లే.. అంటోంది అందాల మలైకం.
Also Read: గాసిప్ క్వీన్ మెహ్రీన్.! ఐటమ్ బాంబ్ ప్రగతి.!
అలా చూస్తే, సమంతకి ఏమంత వయసయిపోయిందని.? పెళ్ళి చేసుకుని, విడాకులు తీసుకోవడం అనేది ఆమె జీవితానికే ఏదో పెద్ద మచ్చ.. అంటే ఎలా కుదురుతుంది చెప్మా.?