rajinikanth, shankar, akshay kumar, amy jackson,

600 కోట్ల సాంకేతిక అద్భుతం.!

500 0

రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘2.0’ సినిమా కోసం సుమారు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఈ విషయాన్ని ట్రైలర్‌ లాంఛ్‌ సందర్భంగా సాక్షాత్తూ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ సినిమా కోసం జరిగిన ఖర్చులో సింహభాగం, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసమేనని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ అంటున్నాయి. 2017లోనే ఈ సినిమా విడుదల కావాల్సి వుండగా, ఈ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సమస్య కారణంగానే ఇంత ఆలస్యమయ్యింది. సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డామో, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం అంతకు మించి కష్టపడాల్సి వచ్చిందని దర్శకుడు శంకర్‌ చెప్పాడు.

వంద కోట్లంటేనే బెదిరిపోవాలి మరి.!

వంద కోట్లు ఖర్చు చేసి సినిమా తీయడమంటే అది చాలా పెద్ద రిస్క్‌. అయితే, ఈ మధ్య ఈ ఫిగర్‌ సాధారణమైనదిగానే మారిపోంది పెద్ద హీరోల సినిమాలకి. తెలుగులో అయితే మరీనూ! 100 కోట్లు ఖర్చు చేసి, కాస్త మంచి ప్రోడక్ట్‌గా ఆ సినిమాని రూపొందించగలిగితే లాభాలు కొల్లగొట్టేయవచ్చునని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు. అయినాగానీ ఇప్పటికీ 100 కోట్లు అంటే రిస్క్‌ ఫ్యాక్టర్‌గానే భావిస్తున్నారు. తెలుగులో 100 కోట్ల బడ్జెట్‌ దాటిన సినిమాల గురించి చెప్పుకోవాలంటే లిస్ట్‌లో ‘బాహుబలి’ ఒక్కటే కనిపిస్తుంది.

ఫెయిల్యూర్స్‌ భయపెడ్తున్నాయ్‌

తెలుగు సినిమాల సంగతి పక్కన పెడితే, తమిళంలో రజనీకాంత్‌తో సినిమా తీయాలంటే, 100 కోట్లు పెద్ద కష్టమేమీ కాదంటారు నిర్మాతలు. ఆయన సినిమాలు సాధించే వసూళ్ళు అలా వుంటాయి. ఫెయిల్యూర్‌ వచ్చినా, పెద్ద ఇబ్బంది ఏమీ వుండదన్న అభిప్రాయాలు రజనీకాంత్‌ సినిమాల విషయంలో అక్కడ వినిపిస్తుంటాయి. కానీ, ఈ మధ్య రజనీకాంత్‌ కొన్ని పరాజయాలు చవిచూడ్డంతో ‘2.0’ సినిమాపై కొన్ని అనుమానాలూ లేకపోలేదు. అయితే, ఈ అనుమానాలు సినిమా విడుదల డేట్‌ దగ్గర పడేకొద్దీ పటాపంచలైపోతాయ్‌. ఎందుకంటే, ఇది రజనీకాంత్‌ సినిమా.

రజనీకాంత్‌, శంకర్‌, అక్షయ్‌ల వాటానే పెద్దది?

‘2.0’ సినిమాకి అయిన ఖర్చులో రజనీకాంత్‌ వాటా తక్కువేమీ కాదు. ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడు రజనీకాంత్‌. ఆ ‘మొత్తం’ ఎంతన్నది సస్పెన్స్‌. రజనీకాంత్‌ తర్వాత నిస్సందేహంగా పెద్ద వాటా శంకర్‌దే. ఆ తర్వాతే అక్షయ్‌కుమార్‌ రెమ్యునరేషన్‌ని పరిగణనలోకి తీసుకోవాలి. అక్షయ్‌కుమార్‌ సైతం కనీ వినీ ఎరుగని స్థాయిలో రెమ్యునరేషన్‌ అందుకున్నాడని సమాచారమ్‌. ఈ సినిమా కోసం హీరోయిన్‌ అమీ జాక్సన్‌కి కూడా గట్టిగానే రెమ్యునరేషన్‌ ఇచ్చారని సమాచారమ్‌.

ఖర్చు సరే, కొల్లగొట్టేది ఎంత.!

ఖర్చు ఎంతైనా రజనీకాంత్‌ విషయంలో పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇది రజనీకాంత్‌ సినిమా. పైగా, శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ సంచలన విజయాన్ని అందుకుంది. వసూళ్ళ ప్రభంజనమే సృష్టించింది. దాంతో, 600 కోట్లు ఖర్చు చేసినా దానికి రెండింతలు లాభం వచ్చేయడం ఖాయమని సూపర్‌ స్టార్‌ అభిమానులు అంటున్నారు. పైగా, ఇప్పుడాయన రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. దాంతో, అభిమానులు ఈ సినిమాని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఖాయం.

తెలుగు, తమిళ, హిందీ సహా దేశంలోని పలు భాషల్లోకి ‘2.0’ సినిమా విడుదల కాబోతోంది. ఎక్కడికక్కడ ఫ్యాన్సీ ఆఫర్స్‌తో డబ్బింగ్‌ రైట్స్‌ని ఇప్పటికే దక్కించుకున్నట్లు ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. సినిమా హిట్టయితే ఆయా వెర్షన్లకు వచ్చే వసూళ్ళు కూడా అలాగే వుంటాయ్‌ మరి. ఎందుకంటే, ఇది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమా కదా.!

Related Post

‘ఇస్మార్ట్‌’.. బాక్సాఫీస్‌పై చూపిస్తాడా ఆ ఇంపాక్ట్‌.?

Posted by - June 15, 2019 0
సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్‌ (Puri Jagannath) ఏం చేసినా అదొక సంచలనమే. ఇప్పుడంటే సక్సెస్‌ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడు. కానీ, ఒకప్పుడు…

‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో’ ఏంటో తెలుసా?

Posted by - October 22, 2018 0
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కనీ వినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ‘సాహో’ (Saaho). ఈ ‘సాహో’కి సంబంధించి కొన్ని ‘షేడ్స్‌’ (Shades…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *