Samantha Ruth Prabhu Chaitu టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, తెలుగమ్మాయ్ శోబిత దూళిపాళతో డేటింగులో వున్నాడంటూ రూమర్స్ ప్రచారంలో వున్న సంగతి తెలిసిందే.
అసలు ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయ్.? అన్న డౌట్ పడాల్సిన పనేమీ లేదు. రూమర్స్ అంటేనే అంత. చిత్రమేంటంటే, చాలా సందర్భాల్లో ఈ రూమర్స్ నిజమవుతుంటాయ్.
సమంత – నాగచైతన్య ప్రేమలో పడ్డారంటూ తొలుత రూమర్స్ వచ్చాయి. చివరికి అది నిజమని తేలింది. ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత, ఇద్దరి మధ్యా మనస్పర్థలు వచ్చాయనే రూమర్స్ వెలుగు చూశాయ్.
ఏవైతే రూమర్స్ వచ్చాయో, అవి నిజమేనన్నట్లు కొన్నాళ్ళ తర్వాత సమంత – నాగచైతన్య (Akkineni Naga Chaitanya) అధికారికంగా విడిపోయారు, విడాకులు తీసుకున్నారు.
‘ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు.? బుర్ర వుందా.?’ అంటూ విడాకుల రూమర్లపై సమంత గుస్సా అయ్యిందిగానీ, ఆ రూమర్స్ నిజమయ్యాయి కదా.?
Samantha Ruth Prabhu Chaitu సమంత ఎందుకు స్పందించింది.?
సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే, తాజా రూమర్ నాగచైతన్య – శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) డేటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ గాసిప్ సృష్టించిందే సమంత పీఆర్ టీమ్ అనే ప్రచారం తెరపైకొచ్చింది.

అంతే, సమంత మీద ట్రోలింగ్ మొదలైంది. ఎట్టకేలకు, సమంత (Samantha Prabhu) ఈ వ్యవహారంపై స్పందించింది.
‘అమ్మాయిపై రూమర్లయితే ఖచ్చితంగా నిజమే కావొచ్చు.. అదే అబ్బాయి మీద రూమర్లయితే, అమ్మాయి సృష్టించినవి.. మీరు చాలా ఎదగాలి..’ అంటూ హితబోధ చేసింది సమంత.
‘పార్టీస్ ఇన్వాల్వ్డడ్ హేవ్ క్లియర్లీ మూవ్డ్ ఆన్..’ అంటూ సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం మరో ఆసక్తికరమైన అంశం.
అంటే, తాను అలాగే నాగచైతన్య తమ తమ పనుల్లో బిజీ అయిపోయామని సమంత చెబుతోందేమో.! లేదు, ఆ చైతూ – శోబిత మధ్య వున్న రూమర్ నిజమేనని చెబుతోందా.?
ముందుకు నడవండి.!
‘మీరైతే ముందుకు నడవాలి.. మీ పని మీద ఫోకస్ పెట్టండి.. మీ కుటుంబాల మీద కూడా.. ముందుకు నడవండి..’ అంటూ ట్వీటేసింది సమంత.
Also Read: సాయి పల్లవీ.! అది తప్పు, ఆ రెండూ ఒక్కటి కాదు.!
తలైవి.. ‘వాత’ సరిగ్గా పెట్టిందంటూ సమంత అభిమానులు స్పందిస్తున్నారు.. ఆమెను అభినందిస్తున్నారు.. ఆమె ధైర్యానికి హేట్సాఫ్ అంటున్నారు.
మరోపక్క, చైతూ – శోభిత డేటింగ్ గాసిప్‌ని హైలైట్ చేయడానికే సమంత ఇలా స్పందించిందంటూ నాగచైతన్య అభిమానులు, సమంతపై ట్రోలింగ్ మరింత తీవ్రతరం చేశారు.