Urvashi Rautela Mandir.. ఐటమ్ బాంబ్ ఊర్వశి రౌతెలా తెలుసు కదా.? తెలియకపోవడమేంటి.? ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసేసింది కదా.!
మొన్నీమధ్యనే నందమూరి బాలకృష్ణతో ‘డాకు మహరాజ్’ సినిమా కోసం పోలీస్ గెటప్‌లో కనిపించేసి, స్పెషల్ సాంగ్ కూడా చేసేసిందీ బ్యూటీ.
అందాల పోటీలు, ఆపై మోడలింగ్.. ఇప్పుడేమో సినిమా రంగంలో హంగామా.. ఇదీ ఊర్వశి రౌతెలా సంగతి. ఆ మధ్యన, క్రికెటర్ రిషబ్ పంత్‌తో డేటింగ్ కూడా చేసిందీ బ్యూటీ.
అప్పట్లో రిషబ్ పంత్ మీద కూడా..
రిషబ్ పంత్ – ఊర్వశి రౌతెలా మధ్య బ్రేకప్, ఈ క్రమంలో ఇద్దరి మధ్యా ట్వీట్ల యుద్ధం తెలిసిన విషయాలే. అసలు ఎఫైర్ అనేదే లేదనీ, వుందనీ.. ఇద్దరి మధ్యా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.
తాజాగా, ‘ఊర్వశి రౌతెలా మందిర్’ అంటూ, ఇంకో రచ్చ నడుస్తోంది.
పవిత్ర పుణ్యక్షేత్రం బద్రినాథ్‌కి వెళ్ళే మార్గంలో, తన పేరుతో ఓ దేవాలయం వుందని తాజాగా ఊర్వశి రౌతెలా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.

దక్షిణాదిలో కూడా తనకు ఓ దేవాలయాన్ని అభిమానులు నిర్మించాలని తాను కోరుకుంటున్నట్లు ఆ ఇంటర్వ్యూలో సెలవిచ్చి అందర్నీ విస్మయానికి గురిచేసింది ఊర్వశి.
దాంతో, విషయం ముదిరి పాకాన పడింది. అసలు ఊర్వశి రౌతెలాకి ఎక్కడా దేవాలయం లేదు. బద్రినాథ్ మార్గంలో దేవాలయం వున్నమాట వాస్తవమే అయినా, దానికీ.. ఊర్వశికీ సంబంధమే లేదు.
Urvashi Rautela Mandir.. తూచ్.. డ్యామేజ్ కంట్రోల్..
ఈ విషయాన్ని స్వయానా సదరు దేవాలయ అర్చకులే స్పష్టం చేశారు. ఊర్వశి రౌతెలా పబ్లిసిటీ స్టంట్లపై గుస్సా అయ్యారు. ఈ వ్యవహారంపై ఊర్వశి టీమ్, డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది.
Also Read: మంచు మనోజ్ ‘లేడీ గెటప్పు’ గోలేంటి.?
‘ఊర్వశి వ్యాఖ్యల్ని వక్రీకరించారు. తన పేరుతో దేవాలయం వుందని మాత్రమే ఆమె చెప్పారు. అంతేగానీ, ఆ దేవాలయం తనదేనని ఆమె అనలేదు’ అంటూ ఊర్వశి టీమ్ వివరణ ఇచ్చింది.

ఓ విద్యా సంస్థలో ఊర్వశి ఫొటోకి పాలాభిషేకం జరిగిన మాట వాస్తవమేననీ, అదే ఆమె చెప్పారనీ, ఊర్వశి రౌతెలా టీమ్ బుకాయిస్తోంది.
సినీ ప్రముఖుల ఫొటోలకి, విగ్రహాలకీ, కటౌట్లకీ పాలాభిషేకాలు మామూలే. అది చూసి, తమకేదో దైవత్వం వుందనీ, దేవుళ్ళతో తాము సమానమనే భ్రమల్లో వుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?