Meena Husband Vidyasagar.. ఎద్దు ఈనింది.. అని ఎవడో అంటే, కాస్తంత కూడా కామన్సెన్స్ ఉపయోగించకుండా ‘అయితే, దూడని కట్టెయ్’ అని ఇంకెవడో అన్నాడట. అలా తయారైంది పరిస్థితి.!
పావురం మనిషిని చంపెయ్యడమేంటి.? పావురానికి మనిషిని చంపేంత శక్తి వుంటుందా.? ఏం, కంటికి కనిపించని ఓ వైరస్ ప్రపంచాన్ని వణికించెయ్యడంలేదూ.! అలాంటప్పుడు, పావురం మనిషిని చంపేసినా చంపేయొచ్చు.!
కానీ, ఇక్కడ అసలు విషయం వేరే వుంది. సినీ నటి మీనా భర్త అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు లంగ్స్ ఇన్ఫెక్షన్ వుంది. ఆ కారణంగానే, ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేందుకూ కుటుంబ సభ్యులు ప్రయత్నించగా, ఇంతలోనే పరిస్థితి విషమించి మీనా భర్త విద్యాసాగర్ ప్రాణాలు కోల్పోయారు.
Meena Husband Vidyasagar.. పావురం తెచ్చిన ప్రమాదమా.?
విద్యా సాగర్ వయసు 50 ఏళ్ళ లోపే.! ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మీనా, ఆమె కుమార్తు.. విద్యా సాగర్ మృతితో శోక సంద్రంలో మునిగిపోయారు.
ఈ సమయంలో, ‘పావురాల వల్లనే మీనా భర్త విద్యా సాగర్ చనిపోయారు..’ అంటూ మీడియా కథనాలు వండి వడ్డించేయడం మొదలు పెట్టింది.

మొన్నామధ్య, సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైతే, ‘గంటకు నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో బైక్ దూసుకెళ్ళింది..’ అంటూ ఓ న్యూస్ ఛానల్ పరిశోధనాత్మక (?!) కథనాన్ని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.
పావురాలకీ, మీనా భర్త విద్యా సాగర్ చనిపోవడానికీ సంబంధమేంటి.? పావురాల ద్వారా అనేక ఇన్ఫెక్షన్లు సోకుతాయన్నది నిర్వివాదాంశం. వైద్యులూ ఇదే విషయాన్ని పదే పదే చెబుతుంటారు.
నవ్విపోదురుగాక మీడియాకేటి సిగ్గు.?
ప్రధానంగా పావురాల వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తుంటాయి. అది కూడా నిజమే. కానీ, పావురాల వల్లనే మనిషి చనిపోతాడనీ, అందునా విద్యా సాగర్ మరణానికీ పావురాలే కారణమని అంటే ఎలా.?
Also Read: శునక యోగం.! రాజసం, వివాదం.! విమానయానం.!
పెంపుడు జంతువుల నుంచీ అనేక రకాలైన వ్యాధులు సంక్రమిస్తాయ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. దేశంలో ఎక్కడికక్కడ పావురాలు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. వాటివల్ల అనారోగ్య సమస్యలూ ప్రజలకు వస్తుండొచ్చు.
కానీ, పావురాల వల్ల మనుషులు చనిపోతారనే ‘భయాందోళన’ కలిగించేలా కథనాలు ఎంతవరకు సబబు.? అన్నిటికీ మించి, మీనా కుటుంబం శోక సంద్రంలో వున్న ఈ తరుణంలో, ఈ కథనాలా.? నవ్విపోదురుగాక సోకాల్డ్ మీడియా వాళ్ళకేటి సిగ్గు.?