Table of Contents
2019 ఎన్నికల కోసం జనసేన పార్టీని (Jana Sena Party) పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేందుకు ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో వున్నారు ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan). ఓ వైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, ఇంకో వైపు రాజకీయంగా వ్యూహాత్మకమైన అబుగులేస్తున్నారు జనసేనాని. తాజాగా, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఉత్తరప్రదేశ్‌కి వెళ్ళారు.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనే కాక, దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (Bahujan Samaj Party BSP) అధినేత మాయావతితో (Mayavathi) పవన్‌కళ్యాణ్ సంప్రదింపులు జరుపుతారు. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీతో కలిసి జనసేన అడుగులు వేయడానికి మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయాలు ఇటు జనసేనలోనూ, అటు బహుజన్ సమాజ్ పార్టీలోనూ వ్యక్తమవుతున్నాయి.
తిత్లీ తుపాను కష్టాలపై గవర్నర్‌కి నివేదిక
అధికార తెలుగుదేశం పార్టీ, శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam District) సంభవించిన తుపాను (Cyclone Titli) నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టినా, బాధితులకు పూర్తిస్థాయిలో సహాయం అందలేదన్న భావన వుంది. ఈ నేపథ్యంలో తుపాను (Titili Cyclone) సృష్టించిన బీభత్సం, కలిగించిన నష్టం, బాధితుల వెతలపై గవర్నర్ నరసింహన్‌కి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదకను పరిశీలించి, నష్టంపై కేంద్రానికి పూర్తి వివరాలు తెలియజేయాలని నరసింహన్‌కి (Governor Narasimhan)విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత. పవన్ సూచనల పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఈ అంశంపై తీసుకునే చర్యల ఆధారంగా, జనసేనాని ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని కలిసే అవకాశాలూ లేకపోలేదు.
పంచాయితీ ఎన్నికలపై కన్నేసిన జనసేన
పంచాయితీ ఎన్నికల్ని జరిపే పరిస్థితుల్లో చంద్రబాబు సర్కార్ (Nara Chandrababu Naidu) లేకపోయినా, హైకోర్టు తీర్పు తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలు మూడు నెలల్లోనే జరగాల్సిన రిస్థితి ఏర్పడింది. ఇటీవల గోదావరి నదిపై కవాతు (Jana Sena Kavaathu) నిర్వహించిన సందర్భంగా పవన్‌కళ్యాణ్, ‘దమ్ముంటే పంచాయితీ ఎన్నికలు నిర్వహించండి’ అంటూ సవాల్ విసిరారు. పంచాయితీ ఎన్నికల కోసం జనసేన ఎంత పకడ్బందీ ఏర్పాట్లతో వుందో జనసేనాని మాటల్లోనే అర్థమవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పంచాయితీ ఎన్నికలు జరిగితే, ఆ ప్రభావం ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని జనసేన భావిస్తోంది.

Pawan Kalyan, ESL Narasimhan
జనసేనలోకి పోటెత్తనున్న చేరికలు
ఇతర రాజకీయ పార్టీల్లోంచి జనసేన పార్టీలోకి నేతల వలసలు పోటెత్తనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఇప్పటికే కాంగ్రెస్‌ని వీడి, జనసేన పార్టీలో చేరారు. మరికొంతమంది ఇతర పార్టీల నేతలూ జనసేనానితో టచ్‌లో వున్నారు. నవంబర్‌లో జనసేన పార్టీలోకి పెద్దయెత్తున చేరికలు వుంటాయని ఆ పార్టీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు మరింత ఉధృతం చేయబోతోంది జనసేన.
కింగ్.? కింగ్ మేకర్.?
2019 ఎన్నికల్లో జనసేన తమ అంచనాలకు మించిన విజయం సాధిస్తుందనే ధీమా జనసేన వర్గాల్లో కన్పిస్తోంది. ఒకవేళ తృటిలో అధికారం దక్కని పరిస్థితి వస్తే, ఖచ్చితంగా కింగ్ మేకర్ అయి తీరతామనే భావన కూడా ఆ పార్టీలో లేకపోలేదు. కింగ్ మేకర్ అనే ఆలోచన ప్రస్తుతానికి చేయడంలేదనీ, పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం ఖాయమనీ, మెజార్టీ సీట్లలో జనసేనకు పట్టం కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా వున్నారని జనసేన ముఖ్య నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మీడియా వెన్ను దన్ను..
ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదు. దానికి మీడియా పవర్ కూడా వుండాలి. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిన పవన్‌కళ్యాణ్, మీడియా సపోర్ట్ కూడా అందుకుంటున్నారు. జనసేనకు కవరేజ్ ఇస్తోన్న మీడియా ఛానల్స్ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. 2019 ఎన్నికల నాటికి మీడియా సపోర్ట్ పూర్తిస్థాయిలో తనకు దక్కుతుందనే నమ్మకంతో వున్నారు జనసేనాని. అయితే కేవలం మీడియా పవర్‌తోనే తాను పవర్‌లోకి రాలేననే విషయం జనసేనానికీ తెలుసు. అందుకే, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శిస్తూ, ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.