A For Arjun Sarkar.. సినిమాకి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ వుంటే, ఇంటిల్లిపాదీ సినిమాని చూడొచ్చని అర్థం. ‘యు/ఎ’ అంటే, చిన్న పిల్లలు అటు వైపు చూడటం మంచిది కాదని అర్థం.!
‘ఏ’ సర్టిఫికెట్ వస్తేనో.! అదో పండగ, అదో జాతర.! నిజానికి, ‘పెద్దలకు మాత్రమే’ అనే సినిమాలకి ‘ఏ’ సర్టిఫికెట్ వస్తుంటుంది. బూతుతోపాటు, హింసకీ ‘ఏ’ సర్టిఫికెట్లు ఇవ్వడం మామూలే.
హింస అంటే, మామూలు హింస కాదు.. ఇది వేరే లెవల్.! సినిమా సెన్సార్ అయ్యాక ‘హిట్-3’ గురించి బయటకు వచ్చిన టాక్ ఇది.
A For Arjun Sarkar.. హింస.. రక్తపాతం.. హిట్-3
వాస్తవానికి, ట్రైలర్ చూస్తేనే, ఇది అందరూ చూసే సినిమా కాదని అర్థమయిపోతుంది. టీజర్ నుంచే ఆ ఇంప్రెషన్ ఇచ్చేశారు.! పైగా, నాని కూడా అదే చెప్పాడు.
ఈ సినిమా వరకూ, చిన్న పిల్లలు.. ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా వుండండి.. అని నాని చెప్పేశాడంటేనే, సినిమాలోని హింస ఏ స్థాయిలో వుంటుందో అర్థం చేసుకోవచ్చు.

అయితే, ‘సినిమాలో హింస, హింసలా వుండదు. పెయిన్ అర్థం చేసుకోగలిగేలానే వుంటుంది. కథలో లీనమైపోతారు గనుక, హింస అనేది ఇబ్బందికరం కాదు’ అంటున్నాడు నాని.
ఏమో, ఆ సంగతి పక్కన పెడితే, సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ రావడం గురించి ప్రమోట్ చేసుకుంటే, ‘ఏ అంటే అర్జున్ సర్కార్’ అంటూ చిత్ర విచిత్రమైన పోలిక తీసుకొచ్చారు మేకర్స్.
Also Read: రష్మి గౌతమ్.! ఆ అందం వెనుక.. ఎంత కష్టం వుందో.!
కాదేదీ పబ్లిసిటీకనర్హం అంటే, ఇదే మరి.! అన్నట్టు, ఈ ‘హిట్-3’ సినిమాలో నాని సరసన ‘కేజీఎఫ్’ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.
మిగతా విషయాలెలా వున్నా, ‘హిట్-3’ సినిమాకి మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యింది. మరే పెద్ద సినిమా కూడా పోటీ లేకపోవడం ‘హిట్-3’ సినిమాకి చాలా మంచి అడ్వాంటేజ్.
అయితే, నానికి వున్న ఫ్యాన్ బేస్‌లో.. ఎక్కువగా, చిన్న పిల్లలు, మహిళలు.. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్.. ఈ ‘హిట్-2’ సినిమా దరిదాపుల్లోకి కూడా వెళ్ళే పరిస్థితి లేదు.