Vijay Deverakonda VD12 Release.. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.! గౌతమ్ తిన్ననూరి సినిమాలంటే, చాలా స్ట్రైకింగ్‌గా వుంటాయి. ఎమోషనల్ బాండింగ్‌తో కూడుకున్నవై వుంటాయ్.
మాస్.. ఊర మాస్.. అనేలా విజయ్ దేవరకొండతో సినిమాని తెరకెక్కిస్తున్నాడు విజయ్ దేవరకొండ ఈసారి.!
Vijay Deverakonda VD12 Release.. పోస్టర్ మాత్రం మాస్.. ఊరమాస్.!
హింస, రక్తపాతం, ఎమోషన్స్.. ఇలా చాలా వుంటాయట సినిమాలో. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్‌తో చిత్ర యూనిట్ చెప్పకనే చెబుతోంది.
విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ఈ ఆగస్టులోనే రివీల్ చేస్తారట.
Mudra369
పోస్టర్‌కి మాత్రం అభిమానుల నుంచి బీభత్సమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విజయ్ దేవరకొండకి విషెస్ చెబుతూ, ‘మ్యాడ్‌నెస్’ అంటూ కామెంట్ చేసింది ఈ పోస్టర్ మీద రష్మిక మండన్న.
అంతా బాగానే వుందిగానీ, వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఈ సినిమాకి అప్పుడే రిలీజ్ డేట్ ఎందుకు కన్ఫామ్ చేశారబ్బా.?
తొందరపడ్డావ్ సరే.. మాట మీద నిలబడతావా.?
టాలీవుడ్‌లో ఇదో చిత్రమైన వ్యవహారంలా మారిపోతోంది. సినిమా రిలీజ్ డేట్ విషయంలో ముందే తొందరపడి ప్రకటనలు చేయడం, సినిమా సమయానికి రాకపోవడం.. ఇవన్నీ షరామామూలు వ్యవహారాలైపోయాయ్.
అనుకున్న డేట్‌కి సినిమా రాకపోతే, అభిమానులు హర్టవుతారు.. నిర్మాణ సంస్థని తూలనాడుతారు.. దర్శకుడిపై నిందలేస్తారు.
ఒక్కోసారి హీరోకి సైతం సరిగ్గా ప్లాన్ లేదని ఆ హీరోల అభిమానులూ చిరాకు పడటం కూడా సోషల్ మీడియా వేదికగా చూస్తూనే వున్నాం.
Also Read: తల్లి చిన్మయి, తండ్రి రాహుల్.! ఓ చిన్నారి.. వ్యధ.!
మరెందుకు, చిత్ర యూనిట్ ‘రిలీజ్ డేట్’ విషయమై తొందరపడినట్లు.? విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అయినా, కాస్త ఆలోచించి వుండాలి కదా.?
అన్నట్టు, 28 మార్చి 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందన్నది తాజా పోస్టర్ సారాంశం.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.