Table of Contents
‘పెళ్ళెప్పుడు’ అన్న ప్రశ్న మాత్రం తనను అడగొద్దని అంటోంది అందాల చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal). ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ, తెలుగులో స్టార్‌డమ్ సంపాదించుకుంది.
తెలుగు మాత్రమే కాదు, తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించి సత్తా చాటింది కాజల్ అగర్వాల్ . అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో విజయాల్ని అందుకుంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). తెలుగులోనూ, తమిళంలోనూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కాజల్, బాలీవుడ్‌లోనూ మెప్పించింది.
అప్పటికీ ఇప్పటికీ అదే గ్లామర్
వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతుంటుంది.. ఆ తర్వాత, సినిమాల్లో ‘క్యారెక్టర్ ఆర్టిస్ట్’ పాత్రలకే పరిమితమైపోవాల్సి వస్తుంది. కానీ, కాజల్ విషయంలో అలా జరగడంలేదు. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు.. ఇలా హీరో ఎవరైనాసరే, హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ పేరు ఫస్ట్ లిస్ట్‌లో వుంటోంది. అదీ కాజల్ ప్రత్యేకత.
తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినాసరే.. కాజల్‌కి సలాం కొట్టాల్సిందేనన్నట్టుంది పరిస్థితి. వయసుతోపాటే కాజల్ అందం పెరుగుతూ వస్తోంది. అదే ఆమె ప్రత్యేకత అనుకోవాలేమో. ‘లక్ష్మీకళ్యాణం’ నుంచి ఇప్పటిదాకా, ఏ సినిమాలోనూ కాజల్ అగర్వాల్ గ్లామర్ తగ్గలేదు.. పెరుగుతోందంతే.
కాజల్ (Kajal Agarwal) గ్లామర్ సీక్రెట్ ఏంటంటే..
ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా వుండడమే తన గ్లామర్ సీక్రెట్ అంటోంది ఈ అందాల చందమామ (Andala Chandamama). కథల ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని కాజల్ అగర్వాల్ చెబుతోంది.
తాను కూడా కెరీర్‌లో కొన్ని పరాజయాల్ని చవిచూశాననీ, అయితే ఫ్లాప్ వచ్చినప్పుడు కుంగిపోకుండా, సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోకుండా కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం వల్లే తాను ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అవుతున్నట్లు చెప్పింది కాజల్.
పెద్దమ్మ అయినాగానీ..
కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) చెల్లెలు నిషా అగర్వాల్ (Nisha Agarwal) తెలుగులో, తమిళంలోనూ పలు సినిమాల్లో నటించింది. అయితే, కాజల్‌లా నిషాకి స్టార్‌డమ్ దక్కలేదు. దాంతో ఆమె సినిమా కెరీర్‌కి గుడ్ బై చెప్పేసి, పెళ్ళి చేసేసుకుంది.
నిషా అగర్వాల్‌కి ఓ కొడుకున్నాడు. పెద్దమ్మగా, కాజల్ తన సోదరి కుమారుడితో ముద్దు ముద్దుగా ఫొటోలకు పోజులిస్తుంటుంది. అంతమాత్రాన తన వయసేమీ తగ్గిపోదనీ, ఫ్యామిలీకి ఎప్పుడూ తాను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాననీ కాజల్ చెబుతోంది.
గాసిప్స్ ఆమెకు చాలా చాలా దూరం
హీరోయిన్లకు గాసిప్స్ బెడద ఎక్కువ. ఫలానా హీరోతో ఎఫైర్ వుందని హీరోయిన్ల చుట్టూ వచ్చే గాసిప్స్ అన్నీ ఇన్నీ కావు. కానీ, కాజల్ ఈ గాసిప్స్‌కి అతీతం. ఇప్పటిదాకా కాజల్ విషయంలో ఇలాంటి గాసిప్స్ రాలేదు.
నటనను ఓ ప్రొఫెషన్‌గా ఎంచుకున్న కాజల్ (Kajal), సినీ రంగంలో ఇన్నేళ్ళు ఎలాంటి గాసిప్స్ రాకుండా వుందంటే, ఆమె ప్రదర్శించిన ప్రొఫెషనలిజం అలాంటిది. సినీ పరిశ్రమలో అందరితోనూ ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. కాజల్ వెరీ వెరీ స్పెషల్ అనే అందరూ అంటుంటారు. దటీజ్ కాజల్ అగర్వాల్.
విశ్వనటుడితో లైఫ్ టైమ్ బంపర్ ఆఫర్
విశ్వనటుడు కమల్‌హాసన్‌తో (Kamal Hassan) నటించే ఛాన్స్ రావడమంటే చిన్న విషయం కాదు. పైగా, శంకర్ (Shankar) దర్శకత్వంలో కమల్‌హాసన్ (Kamal Haasan) నటిస్తోన్న ‘భారతీయుడు-2’ సినిమాలో కాజల్ అగర్వాల్ అవకాశం దక్కించుకుంది. ఈ మూమెంట్‌ని కాజల్ మేగ్జిమమ్ ఎంజాయ్ చేస్తోంది.
నిజానికి ఇది లైఫ్ టైమ్ బంపర్ ఆఫర్. ‘2.0’ తర్వాత శంకర్ దర్శకత్వంలో రానున్న సినిమా ఇది. 300 కోట్ల బడ్జెట్ అనే ప్రచారం జరుగుతున్నా, 1000 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ అవడం ఖాయమన్న అంచనాలున్నాయి ఈ సినిమా మీద. ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ విడుదలకు సిద్ధమవుతోంది.
పెళ్ళి ఎప్పుడంటే..
అనారోగ్యం కారణంగా సినిమాలకు గైడ్ చెబుదామని అనుకుందట కాజల్ అగర్వాల్. ఆటో ఇమ్యూన్ డిజార్టర్ సమస్యతో తల్లడిల్లిన కాజల్ కోలుకుని, తిరిగి సినిమాల్లో కొనసాగుతోంది. ఈ విషయం కాజల్ స్వయంగా వెల్లడించడంతో అంతా షాక్ అయ్యారు.
ఇక, పెళ్ళి గురించి కాజల్‌ని ప్రశ్నిస్తే, ‘ఆ టైమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుంది. టైమ్ రావాలి, ఇంట్లోవాళ్ళు సంబంధం చూడాలి.. ఆ తర్వాత పెళ్ళి చేసుకుంటాను.. అందరికీ చెప్పే చేసుకుంటాను..’ అని కాజల్ అగర్వాల్ పెళ్ళి గురించి తెలివిగా సమాధానమిచ్చింది.