Home » పెళ్లి.!  జరగాలి మళ్లీ మళ్లీ మళ్లీ..!

పెళ్లి.!  జరగాలి మళ్లీ మళ్లీ మళ్లీ..!

by hellomudra
0 comments
Alia Bhatt

New Age Wedding Again.. ఆడదానికి ఒకడే భర్త.! మగాడికి ఒక్కతే భార్య.! ఇదంతా పాత కథ.  ఇప్పుడు లెక్కలు మారిపోయాయ్.

వన్ ప్లస్ వన్.. ఆ తర్వాత ఎన్నయినా ప్లస్‌లు. స్త్రీ పురుషులిద్దరికీ ఈ ఈక్వేషన్ సమానమే. రోజులు మారాయ్. లెక్కలూ మారాల్సిందే.

ఒకప్పుడు సతీసహగమనం వుండేది. ఇప్పుడా మాట ఎవరైనా ఎత్తితే గూబ గుయ్యమనిపోద్ది. అదొక సాంఘిక దురాచారం.

ఇప్పుడు కొన్ని పెళ్లిళ్లు అంతకన్నా దురాచారాలు.. అన్నట్లు తయారయ్యాయ్ అని కొందరు వాపోతుంటారు.

ముందు స్నేహం, తర్వాత ప్రేమ, అది ముదిరితే డేటింగ్, ఇంకో అడుగు ముందుకేసి సహజీవనం, ఆ తర్వాత పెళ్లి.. ఆనక విడాకులు మళ్లీ కథ మొదటికి.

అంటే, స్నేహం నుంచి విడాకులదాకా.. ఇలా ఎన్నిసార్లయినా చేసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు.

New Age Wedding Againపెళ్ళి కథ మారిపోయిందిలా.!

అన్నట్లు స్వలింగ సంపర్కమూ నేరం కాదిప్పుడు. సో స్నేహం, ప్రేమ, పెళ్లి.. వీటి పేరుతో ఏదైనా చేసేసుకోవచ్చు. ఆగండాగండి. ఎక్కడికో వెళ్లిపోతున్నాం. అసలు విషయంలోకి వచ్చేద్దాం.

ఓ సినీ నటి ఓ సారి ప్రేమలో పడింది. సహజీవనం కూడా చేసింది. ఆ తర్వాత ‘బ్రేకప్’.

మళ్లీ కొత్తగా ఇంకో ప్రేమాయణం షురూ చేసింది. ‘మానసికంగా మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది..’ అని ప్రకటించేసింది. ట్విస్ట్ అంటే ఇదీ.

ఆయా సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు జరగడం విన్నాం కానీ, ఈ మానసికంగా పెళ్లవడం ఏంటీ.? అదే మరి కొత్త ట్రెండ్ అంటే.

భౌతికంగా ఆ టచ్‌తో పనే లేదు.!

స్త్రీ పురుషులు భౌతికంగా కలవాల్సిన పనే లేకుండా రకరకాల పద్ధతుల్లో సాంకేతికంగా తల్లితండ్రులైపోతున్నారీ నయా ట్రెండులో. ఆ లెక్కన మానసికంగా పెళ్లిళ్లు చేసుకోవడం వింతేమీ కాదు.

పెళ్లి మాత్రమే మానసికంగా జరిగే ప్రక్రియ. శారీరక అవసరాలు మాత్రం భౌతికంగానే తీర్చుకోవాలి.

పాడైపోయిన సమాజం అంటారా.? అలా అంటే మీరు, ఈ జనరేషన్‌కి ఆమడ దూరంలో వున్నట్లు. నయా ప్రపంచంలో మీకు చోటు కష్టమే.

మానసికంగా పెళ్లి చేసేసుకున్నారు కాబట్టి, ఇక భౌతికంగా పెళ్లి చేసుకోవల్సిన అవసరమేంటీ.?

ఇంకా నయం, అలా అని అందరూ అనుకుంటే, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలేమైపోవాలి.? పెళ్లి ప్రచార హక్కులు, ఫోటో సెసన్లు, వీటి వల్ల సెలబ్రిటీలకు వచ్చే ఆదాయమో మరి.

పబ్లిసిటీ పెళ్ళిళ్ళు వచ్చేశాయ్.!

పబ్లిసిటీ కోసం పెళ్లి చేసేసుకుంటే, ఆ తర్వాత విడాకుల అస్త్రం ఎలాగూ వుంటుంది.

చిత్రమేంటంటే, డేటింగులోనూ, సహజీవనంలోనూ వున్నంత మజా వైవాహిక జీవితంలో సో, కాల్డ్ సెలబ్రిటీలకు దొరకట్లేదు పాపం.

Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?

ఇదండీ వరస. సినిమా వోళ్లని చులకనగా చూసేరూ.! మన చుట్టూ వున్న సమాజంలోనూ ఇలాంటివి చాలానే జరుగుతున్నాయ్. ఏది తప్పు.? ఏది ఒప్పు.? మనమెలా నిర్ధారించగలం.!

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group