బిగ్‌బాస్ సీజన్ 4 విజేత ఎవరు.? అన్న ప్రశ్నకు సమాధానం దాదాపుగా దొరికేసింది. మధ్యలో తేడాలేమీ జరగకపోతే, అబిజీత్ (Abijeet BB4 Telugu Boss) ఈ సీజన్ విన్నర్ అవడం దాదాపు ఖాయమే. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని కుండబద్దలుగొట్టేశారు.
ఆయా కంటెస్టెంట్స్ తాలూకు కుటుంబ సభ్యులు టాప్ 5లో ఎవరుంటారు.? అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయా కంటెస్టెంట్స్ పేర్లు చెప్పగా, అత్యధికంగా ఓట్లు అబిజీత్‌కే పడ్డాయి. అంతే కాదు, మోనాల్ విషయంలో అబిజీత్ పట్ల చాలామంది నెగెటివ్‌గా మాట్లాడుతున్నా, సాక్షాత్తూ మోనాల్ తల్లి కూడా అబిజీత్ తన ఫేవరెట్ కంటెస్టెంట్ అని తేల్చేశారు.
Also Read: అబిజీత్.. రియల్ బిగ్ హీరో ఆఫ్ ది సీజన్.!
అఖిల్‌తో అబిజీత్‌కి చాలా గొడవలున్నాయి.. అయితే, అఖిల్ సోదరుడు మాత్రం అబిజీత్‌కి తాను బిగ్ ఫ్యాన్ అని చెప్పేశాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి సాక్ష్యం.. అబిజీత్ నెంబర్ వన్ కంటెస్టెంట్ అని చెప్పడానికి.! అబిజీత్ బిగ్ హౌస్‌లో ఏం మాట్లాడుతున్నాడనేది ప్రపంచమంతా చూస్తోంది.
హౌస్‌లో వున్నవాళ్ళకే మేటర్ అర్థం కావడంలేదు. అబిజీత్‌తో అడ్డగోలు వాదనలు పెట్టుకోవడం కంటెస్టెంట్స్‌కి బ్యాడ్ అయిపోతోందన్నది నిర్వివాదాంశం. ఆయా కంటెస్టెంట్స్ తాలూకు కుటుంబ సభ్యులే ‘అబిజీత్ కరెక్ట్’ అని చెప్పేశాక.. ఇక, పంచాయితీ అనవసరం.. ఎలాంటి వివాదాలకూ తావు లేకుండా అబిజీత్‌ని నెంబర్ వన్‌గా అందరూ డిసైడ్ చేసేసినట్లయిపోయింది.
Also Read:వెరీ వెరీ స్పెషల్: కౌశల్ బాటలో అబిజీత్.!
అయితే, తనకు ఎక్కువ మంది ఓట్ చేయడం పట్ల అబిజీత్ (Abijeet BB4 Telugu Boss) ఏమాత్రం గర్వం ప్రదర్శించడంలేదు. ‘ఏదో ఆటలో భాగంగా కొట్లాడుతున్నాం.. దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దు..’ అని చెప్పడమే కాదు, ‘క్షమించండి’ అంటూ మోనాల్ తల్లికీ, అఖిల్ సోదరుడికీ విజ్ఞప్తి చేశాడు అబిజీత్.. అదీ అతని గొప్పతనం.
ఇక, అబిజీత్ విషయంలో మోనాల్ సోదరి చేసిన చెత్త కామెంట్స్‌పై, ఆమె తల్లి స్పందించారు.. అబిజీత్‌కి క్షమాపణ కూడా చెప్పారు. ఇదిలా వుంటే, సోషల్ మీడియాలో అబిజీత్ అభిమానులు మరింత యాక్టివ్ అయ్యారు. ‘వి అడ్మైర్ అబిజీత్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు.
ఓ స్టార్ హీరో స్థాయిలో ఈ హ్యాష్‌ట్యాగ్‌ని అబిజీత్ అభిమానులు ట్రెండింగ్ చేస్తుండడం గమనార్హం. లక్ష దాటి రెండు లక్షల దిశగా దూసుకుపోతోన్న ఈ హ్యాష్ ట్యాగ్.. బిగ్‌బాస్ హిస్టరీలోనే సరికొత్త ట్రెండ్ సృష్టించేలా వుంది.