Table of Contents
బిగ్‌బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తోంది. తాజా సీజన్‌లోనూ ఆయా కంటెస్టెంట్స్ తాలూకు కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చారు. రియాల్టీ షో (Bigg Boss Telugu 4 Abijeet The Winner) అంటే ఏంటో వాళ్ళకి ముందే తెలుసు గనుక, హౌస్‌లోని గొడవల్ని లైట్ తీసుకుంటారు.. అందరితోనూ సమానంగానే మాట్లాడతారు.
కానీ, అరుదుగా మాత్రమే, హౌస్‌లోకి ఎంటర్ అయి, హౌస్‌లోని వాతావరణాన్ని చెడగొట్టేస్తారు కొందరు హౌస్ మేట్స్ తాలూకు కుటుంబ సభ్యులు. ఈ లిస్ట్‌లో మోనాల్ సోదరి చేరిపోయింది. ‘ఏదన్నా వుంటే మొహమ్మీద మాట్లాడు.. వెనకాల మాట్లాడొద్దు..’ అంటూ అబిజీత్‌కి ఉచిత సలహా ఇచ్చింది మోనాల్ సోదరి.
Also Read: సూటిగా సుత్తి లేకుండా.. అబిజీత్ ‘టాస్క్ ఫినిష్డ్’.!
తన సోదరి మోనాల్‌కి ఆమె ఏమైనా చెప్పుకోవచ్చుగాక.. కానీ, ఇతర కంటెస్టెంట్స్ మీద నెగెటివ్ రిమార్క్స్ పాస్ చేయడమేంటి.? ఇది జస్ట్ నాన్సెన్స్ అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, నాలుగో సీజన్‌కి సంబంధించినంతవరకు వన్ అండ్ ఓన్లీ బిగ్ కంటెస్టెంట్ ఇంకెవరో కాదు అబిజీత్.
దాదాపు ప్రతి వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అవుతున్నాడు.. కానీ, అతని అభిమానులు అతన్ని మేగ్జిమం సపోర్ట్ చేస్తున్నారు. ఓట్ల పరంగా చూసుకుంటే అబిజీత్ దాదాపు ప్రతి వారం టాప్ ఛెయిర్ దక్కించుకుంటున్నాడు. ఇది గిట్టని వాళ్ళు అతని మీద నెగెటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పాస్ చేయొచ్చుగాక. కానీ, ఓ హౌస్ మేట్ కుటుంబ సభ్యురాలిలా మాట్లాడటం అభ్యంతకరం.
Also Read: అబిజీత్.. రియల్ బిగ్ హీరో ఆఫ్ ది సీజన్.!
పైగా, అబిజీత్‌ని అందరి ముందూ పెట్టి మాట్లాడటం ఇంకా దారుణం. ఒక్క మాట అబిజీత్, ‘నీ పని నువ్వు చూసుకో..’ అనేసి వుంటే, పరిస్థితి ఎలా వుండేది.? ఇప్పుడిప్పుడే అబిజీత్ – అఖిల్ – సోహెల్ ప్యాచప్ అవుతున్నారు. దాన్ని కూడా మోనాల్ సోదరి చెడగొట్టేసింది.
మోనాల్ సోదరి వచ్చాక, ఆమె కామెంట్స్ పట్ల గుసగుసలాడుకున్నారు అఖిల్, సోహెల్. ‘భలే మాట్లాడింది కదా..’ అని అఖిల్, సోహెల్ అనుకుంటుండగా, ‘నేను ముందే చెప్పాను కదా.. మా సిస్టర్‌కి స్ట్రెయిట్ ఫార్వార్డ్‌నెస్ ఎక్కువ..’ అంటూ మోనాల్ ఆ సీన్‌లోకి ఎంటర్ అయ్యింది.
Also Read: వెరీ వెరీ స్పెషల్: కౌశల్ బాటలో అబిజీత్.!
మరోపక్క హారిక మాత్రం, మోనాల్ సోదరి తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘అబిజీత్ ముందూ, వెనుకా ఒకటే మాట్లాడతాడు..’ అని చెప్పింది హారిక. అది నిజం కూడా. అఖిల్, సీక్రెట్ రూంలోకి వెళ్ళినప్పుడు, ‘వింటున్నావా అఖిల్.. లోపలికి వస్తావ్ అని తెలిసే మాట్లాడుతున్నా..’ అంటూ అఖిల్ గురించి మాట్లాడిన డేరింగ్ అండ్ డాషింగ్ అబిజీత్ (Bigg Boss Telugu 4 Abijeet The Winner) మీద మోనాల్ సోదరి ఇలా చెత్త కామెంట్స్ ఎలా పాస్ చేయగలిగిందట.?