బిగ్‌హౌస్‌లో మొదటి నుంచీ తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి మాట్లాడుతున్న సమయంలో అబిజీత్‌కి అడ్డు తగిలింది హారిక. అదీ మోనాల్ గజ్జర్ గురించి కావడం గమనార్హం. కన్ఫెషన్ రూమ్‌లోకి హారికని పిలిచి, హోస్ట్ అక్కినేని నాగార్జున పీకిన క్లాస్ గురించి అబిజీత్‌కి తెలుసా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆ ఎపిసోడ్‌తో హారికలో (Abijeet Fires On Harika) చాలా మార్పు వచ్చింది, అబిజీత్‌తో స్నేహం విషయంలో.
అబిజీత్‌ని సపోర్ట్ చేస్తే, గేమ్ నుంచి తనను పక్కకు తప్పించేస్తారేమోనన్న భయం హారికలో పెరిగిపోయింది. అందుకే, మోనాల్ ఎపిసోడ్ గురించి అబిజీత్ మాట్లాడుతోంటే, అర్థం పర్థం లేకుండా, సమయం సందర్భం చూసుకోకుండా ‘తెలుగులో మాట్లాడు’ అనేసింది.
అప్పటిదాకా అబిజీత్‌తో (Abijeet) సమానంగా ఇంగ్లీషులో మాట్లాడింది హారిక (Alekhya Harika). నిజానికి, హారిక ‘తెలుగులో మాట్లాడు’ అనడం తప్పు కాదు. కానీ, ఆ టైమింగ్ మాత్రం వెరీ వెరీ బ్యాడ్. దాంతో అబిజీత్ హర్ట్ అయ్యాడు. నేను ఇంగ్లీషులో మాట్లాడితే, బిగ్ బాస్ చూసుకుంటాడు.. విషయాన్ని నువ్వెందుకు డైవరట్ చేస్తున్నావ్.. అంటూ అబిజీత్ ఒకింత స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చేశాడు హారికకి.
అబిజీత్, మోనాల్ (Monal Gajjar) కారణంగా ఎదుర్కొంటున్న సమస్య అలాంటిది. ఆ సమస్య వల్ల ఓ టాస్క్‌ని ఆడలేకపోయాడు అబిజీత్. ఆ సందర్భాన్ని అడ్డం పెట్టుకుని, అబిజీత్‌ని చెడామడా వాయించేశాడు హోస్ట్ నాగార్జున.
ఇదంతా ఓ స్క్రిప్ట్ ప్రకారం జరిగిందన్న విషయం అబిజీత్‌కి అర్థమయిపోయింది. ఆ సమయంలో కెప్టెన్‌గా వున్న హారిక తొలుత అబిజీత్ పరిస్థితిని అర్థం చేసుకుంది. కానీ, ఆమె మైండ్‌సెట్‌ని నాగార్జున పూర్తిగా మార్చేశాడు. ఆ విషయం అబిజీత్‌కి తెలియదు.
దాంతో, ఇంకా హారికతో మోనాల్ ఎపిసోడ్ గురించి మాట్లాడాలనే అనుకున్నాడు అబిజీత్. ఇప్పుడు మేటర్‌లో కొంచెం క్లారిటీ వచ్చినట్టుంది అబిజీత్‌కి. అందుకే, హారికని (Abijeet Fires On Harika) కూడా ఈ విషయంలో అవాయిడ్ చెయ్యక తప్పడంలేదు. గతంలో మోనాల్ విషయంలోనూ ఇలానే, ఇంతకన్నా చాలా ఎక్కువే జరిగింది.
పైకి చెప్పుకోలేనంతగా మోనాల్ విషయంలో అబిజీత్ బాధపడుతున్నా, బిగ్‌బాస్ (Bigg Boss Telugu 4) టీమ్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతోందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాస్సేపు ఏడ్చేస్తుంది, ఆ తర్వాత అన్నీ మర్చిపోతుంది మోనాల్. హౌస్‌లో చాలామంది కంటెస్టెంట్స్‌ది అదే పరిస్థితి.
కానీ, అబిజీత్‌ది జెన్యూన్ ఎమోషన్. అదే అసలు సమస్యగా మారిందతనికి. ఫేక్‌గా వుండాల్సి వస్తే, జరిగిన విషయాల్ని సింపుల్‌గా మర్చిపోయి, రాని నవ్వుని పెదాల మీద బలవంతంగా పులిమేసుకుని, అందరితో కలిసిపోయి.. ఓ గ్యాంగ్‌ని ఫామ్ చేసేసేవాడే. కానీ, అలా జరగడంలేదు. అందుకే అబిజీత్‌కి అంతమంది సపోర్టర్స్ బయట వున్నారు.!