వెండితెర యువ నటుడు అబిజీత్ (Abijeet), బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనే అభిప్రాయం ఇప్పటికే బలపడిపోయింది. హౌస్‌లో వున్న హ్యాండ్సమ్ హంక్స్‌లో అబిజీత్‌కి (Abijeet Bigg Boss Telugu 4) ఎక్కువ మార్కులు పడుతున్నాయి.
అమ్మాయిల్లో అబిజీత్‌కి విపరీతమైన ఫాలోయింగ్ కన్పిస్తోంది. డే వన్ నుంచీ సోషల్ మీడియాలో అబిజీత్‌కి మద్దతుగా ఎక్కువమంది స్పందిస్తున్నారు. అబిజీత్ కోసం బ్యాక్ ఎండ్ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్‌గానే ఏర్పాటయినట్లు తెలుస్తోంది.
హౌస్‌లో (Bigg Boss Telugu 4) సరదాగా వుండడం ఒక్కటీ సరిపోదు. తనను ఎవరు ఎలా ట్రీట్ చేస్తున్నారో కూడా తెలుసుకోవాలి. ఈ విషయంలో అబిజీత్ అడ్వాన్స్‌గానే వున్నట్లు కన్పిస్తోంది. ఎక్కువగా, మోనాల్ గజ్జర్‌తో అబిజీత్ కెమిస్ట్రీ కనిపిస్తోంది. ఇంకోపక్క, అబిజీత్‌కి వ్యతిరేకంగా కొందరు కంటెస్టెంట్స్ హౌస్‌లో పావులు కదుపుతున్నారు.
మరీ ముఖ్యంగా కరాటే కళ్యాని అందరితోనూ గొడవ పడుతున్నట్లే అబిజీత్‌ని (Abijeet Bigg Boss Telugu 4) కూడా కెలుకుతోంది. ఇలాంటి విషయాల్లో అబిజీత్ ఇంకాస్త ఫోకస్డ్‌గా వుండాలేమో. దాదాపు అందరితోనూ కలివిడిగా వుంటున్నా, బిగ్‌బాస్‌లో ఎవరు ఎప్పుడు ఎలా టర్న్ అవుతారో చెప్పలేం.
అదే బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రత్యేకత. గిల్లికజ్జాలు పెట్టేలా టాస్క్‌లను బిగ్‌బాస్, కంటెస్టెంట్స్‌కి ఇస్తుంటాడు. అదే హౌస్ మేట్స్ మధ్య గొడవలకు కారణమవుతుంటుంది. ఫిజికల్ టాస్క్‌ల పరంగా చూసుకుంటే అబిజీత్‌కి పెద్దగా సమస్య వుండకపోవచ్చు.
ఇదిలా వుంటే, షోలో ఎంట్రీ ఇచ్చే సమయంలో అబిజీత్ డాన్స్ పెర్ఫామెన్స్ అదిరిపోయింది. హీరోయిన్ల ఫొటోలు చూసి, ఎవర్ని ప్రేమిస్తాడో, ఎవరితో డేట్ చేస్తాడో, ఎవర్ని ముద్దు పెడతాడో చాలా బోల్డ్‌గా చెప్పేశాడు. ఈ లిస్ట్‌లో మోనాల్ గజ్జర్ పేరు కూడా తెలివిగా నిర్వాహకులు జోడించిన విషయం విదితమే.
టాప్ 5 లిస్ట్‌లో వుండడానికి అన్ని అర్హతలూ వున్న అబిజీత్ (Abijeet), ఈ సీజన్‌లో ఎలా బుల్లితెర వీక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తాడో వేచి చూడాల్సిందే.