ఏంటీ బిగ్‌బాస్ రాజకీయం.? మోనాల్ గజ్జర్, అఖిల్‌ని సపోర్ట్ చేస్తే అది ‘క్యూట్’ అట. ‘ఎవరి గేమ్ వాళ్ళు ఆడండి’ అని మాత్రం హోస్ట్ నాగార్జునతో చెప్పించరట. అదే, అబిజీత్‌ని హారిక సపోర్ట్ చేస్తే మాత్రం (Abijeet Harika Friendship), కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మరీ హోస్ట్ నాగార్జునతో క్లాస్ పీకించేస్తారట.
వావ్.. బిగ్‌బాస్ పాలిటిక్స్, రియల్ లైఫ్ పాలిటిక్స్‌కి మించి వున్నాయ్ కదా.! కొద్ది వారాల క్రితం మోనాల్ – అఖిల్ మధ్య నామినేషన్స్ ఎపిసోడ్ నడిచింది. సింపుల్‌గా మోనాల్, అఖిల్‌ని సేవ్ చేసేసింది. పలు సందర్భాల్లో అఖిల్, సోహెల్, మెహబూబ్ కలిసి ఓ గ్రూప్‌గా టాస్క్‌లు ఆడారు.
Also Read: డర్టీ డ్రామా: ఔను, అబిజీత్ డౌట్ నిజమైంది.!
అరియానా – అవినాష్ ఒకర్ని ఒకరు సపోర్ట్ చేసుకున్నారు. అంతకు ముందు అమ్మ రాజశేఖర్ – దివి మధ్య ఈ ‘సపోర్టింగ్’ ఎపిసోడ్ నడిచింది. అవేవీ తప్పు కానే కాదు.. హోస్ట్ నాగార్జున దృష్టిలో. మోనాల్ వల్ల కెప్టెన్ అయిన హారిక, అబిజీత్ కోసం పనిచేసిందన్నది హోస్ట్ నాగార్జున ఆరోపణ.
స్క్రిప్ట్ అలాగే బిగ్‌బాస్ టీమ్ రచించింది గనుక, హోస్ట్ నాగార్జున, స్టేజ్ మీద అలా యాక్ట్ చేయాల్సి వచ్చింది. సోహెల్‌ని స్వాప్ చేసి, అఖిల్‌ని హారిక సేవ్ చేసి వుంటే, నాగార్జున నుంచి హారికకి ఇంత క్లాస్ పడేది కాదు. అక్కడ బిగ్‌బాస్ టీమ్‌కి నచ్చనిది ఏదన్నా వుందంటే మోనాల్, అఖిల్.. ఇద్దరూ ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేట్ అవడం.
నిజానికి, ఎలిమినేషన్ ప్రక్రియలు ఇప్పటిదాకా చాలానే జరిగినా, వాటిల్లో ఏ ఒక్కటీ పద్ధతి ప్రకారం జరగలేదన్న విమర్శలున్నాయి. అఖిల్‌ని సీక్రెట్ రూమ్‌లోకి పంపేసి, ఆ తర్వాత అతన్ని కెప్టెన్‌ని చేసింది ఎందుకు.? కన్వీనియెంట్‌గా అదన్ని సేవ్ చేయడానికే కదా.
ఇక, ఆట ఎక్కడ పద్ధతి ప్రకారం నడుస్తోందట.? హోస్ట్ నాగార్జున చేత బిగ్ బాస్ టీమ్ ఓ మాట చెప్పించేసింది.. ‘నీ ఆట నువ్వు ఆడు.. అబిజీత్ కోసం ఆడకు..’ అని. అరియానా, అవినాష్ కోసం చేసింది ఏంటి.? సోహెల్, అఖిల్ కోసం చేస్తున్నదేంటి.? అఖిల్ కోసం మోనాల్ చేస్తున్నదేంటి.? వాళ్ళందరికీ అదే మాట ఎందుకు చెప్పలేదో ఏమో.! ప్రశ్నించుకుంటూ పోతే, చాలానే వుంటాయ్.
చూస్తోంటే, ఈసారి టైటిల్ హారిక లేదా మోనాల్‌లలో ఎవరో ఒకరికి ఇచ్చేయాలని ముందే ఫిక్సయిపోయారో ఏమో అనిపిస్తోంది బిగ్ బాస్ వీక్షకులకి.