Acharya Disaster Koratala Siva.. ఆశలు, అంచనాలు.. ఇలా ‘ఆచార్య’ సినిమా గురించి అటు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇంకోపక్క మెగా అభిమానులు, సగటు సినీ అభిమానులు.. చాలా చాలా ప్రత్యేకంగా ఆలోచించారు.
అందరి అంచనాలూ తల్లకిందులయ్యాయి. చాలా ఆశలు గల్లంతయ్యాయి. ‘ఆచార్య’ సినిమా ‘డిజాస్టర్’ అనే ముద్ర వేయించుకుంది. సరే, సినిమా మీద ఓ వర్గం పనిగట్టుకుని చేసిన దుష్ప్రచారం కథ వేరే.!
దర్శకుడు కొరటాల శివ ఏం చెప్పాడు.? ఏం చేశాడు.? మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే అది తన డ్రీమ్.. అన్నాడు. మరి, కలను నెరవేర్చుకునే పద్ధతి ఇలాగేనా.?
Acharya Disaster Koratala Siva .. డ్యామిట్.! కథ అడ్డం తిరిగింది.!
చిరంజీవి, చరణ్ (Mega Power Star Ramcharan)కాంబినేషన్‌లో సినిమా అంటే, కొరటాల ఎన్ని జాగ్రత్తలు తీసుకుని వుండాలి.?

సినిమా విడుదలయ్యాక ఇలాంటి ప్రశ్నలు చాలానే తెరపైకొచ్చాయ్. సినిమా అంటేనే మ్యాజిక్. కావాలని ఎవరైనా ఫ్లాప్ సినిమా తీస్తారా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.
కానీ, కొరటాల శివ (Koratala Siva) లాంటి దర్శకుడు, సినిమాకి సంబంధించి సరైన లెక్కలేవీ వేసేసుకోకుండా సినిమాని తీసెయ్యడం మీదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ని (Kajal Aggarwal) ఎంపిక చేసి, కొంత షూటింగ్ చేసి కూడా ఆమె పాత్రని సినిమా నుంచి లేపేయడం దగ్గర్నుంచి, సినిమాలో చాలా లోపాలున్నాయి.
బాకీ పడ్డాడుగానీ.!
కొరటాల శివ మాత్రమే కాదు, చిరంజీవి (Mega Star Chiranjeevi) అలాగే చరణ్ కూడా ఈ లోపాల గురించి ఆలోచించలేకపోయారా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
‘ఆచార్య’ ఓటీటీలో వచ్చాక, ‘సినిమా బాగానే వుంది కదా.! డిజాస్టర్ అని ఎలా అన్నారు..’ అని కొందరు సాధారణ ప్రేక్షకులు అనుకోవడం కనిపిస్తోంది.
అయితే, ఇంత ‘ఫ్లాట్ నెరేషన్ ఏ సినిమాలోనూ వుండదేమో..’ అనే విమర్శ సహజంగానే తెరపైకొచ్చింది.
Also Read: అడివి శేష్ ఏదో ’కథ‘ చెప్తున్నాడు.. సన్నీలియోన్ వింటోందా.?
మళ్ళీ మెగా ఫ్యామిలీతో హిట్టు కొట్టేదాకా, కొరటాల శివ మీద ‘ఆచార్య’ (Acharya Disaster) మచ్చ తొలగిపోయే అవకాశమే లేదు. కొరటాల శివ, మెగా ఫ్యామిలీకి ఓ హిట్టు బాకీ పడ్డాడు.