Acharya Pre Review.. మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల అంటే, ఆ కిక్కే వేరప్పా.! బాక్సులు బద్దలైపోవడం.. అనే మాట చిరంజీవి సినిమాతోనే షురూ అయ్యింది.
ఒకటా.? రెండా.? 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి, రెండున్నర దశాబ్దాలకు పైనే తెలుగు సినీ పరిశ్రమని ఏక ఛత్రాధిపత్యంగా ఏలేస్తున్నారు. దాదాపు పదేళ్ళు తెలుగు సినీ పరిశ్రమకు దూరమయ్యారు రాజకీయాల కారణంగా.
అయినాగానీ, మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ స్థానం అలాగే ఎప్పటికీ పదిలంగా వుండిపోయింది.
Acharya Pre Review.. బాసూ.! నెంబర్ వన్ నీ ప్లేసూ.!
వన్ టూ టెన్ చిరంజీవిగారే.. ఆ తర్వాతే మేమంతా.. ప్రతి శుక్రవారం నెంబర్లు మారిపోయే జనరేషన్ మాది.. అని సాక్సాత్తూ సూపర్ స్టార్ మహేష్‌బాబు చెప్పడాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
ఆ మెగాస్టార్ చిరంజీవి నుంచి ‘ఆచార్య’ సినిమా వస్తోందంటే ఆ హంగామా ఏ స్థాయిలో వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అగ్నికి వాయువు తోడైనట్లు.. మెగాస్టార్ చిరంజీవికి (Mega Star Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) తోడయ్యాడు ‘ఆచార్య’ సినిమా కోసం.
అమెరికా అయినా, అమలాపురం అయినా.. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఆ హంగామా కనీ వినీ ఎరుగని స్థాయిలో వుంటుంది.
‘మేం చిరంజీవి అభిమానులం.. మాకసలు నిద్దరే పట్టదు..’ అంటూ అభిమానులు, థియేటర్ల దగ్గర జాగారం షురూ చేసేశారు.
బాస్ సినిమా హంగామా అట్లుంటది.!
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? అంటూ బాస్ (Mega Star Chiranjeevi) సినిమా సంబరాల్ని మేగ్జిమమ్ ఎంజాయ్ చేసేస్తున్నారు అభిమానులు.
నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌తో దర్శకుడు కొరటాల శివ, ఓ వెండితెర అద్భుతాన్నే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. పూజా హెగ్దే (Pooja Hegde) ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్‌గా నటించింది.
Also Read: భరించలేని కష్టం.. కానీ, చెప్పలేనంత ఇష్టం
చిరంజీవి సరసన కాజల్ నటించినా, కొన్ని కారణాలతో సినిమాలో ఆమె నటించిన సీన్లు తొలగించారు. రెజినా కస్సాండ్రా మెగాస్టార్ చిరంజీవితో ‘మందాకిని’ అనే స్పెషల్ నెంబర్‌కి అదిరిపోయే స్టెప్పులేసింది.