Chandrika Ravi.. పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలోనే.! కానీ, ఆమెకు భారతీయ మూలాలున్నాయ్.
ఆస్ట్రేలియాలో పుట్టి, పెరిగి.. అమెరికా వెళ్ళి.. అందాల ప్రపంచంలో రాణించి.. ఇప్పుడేమో ఇండియన్ స్క్రీన్ మీద వెలిగిపోవాలనుకుంటోంది ఈ భామ.
మూడేళ్ళ వయసులోనే డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టింది చంద్రిక రవి. పదహారేళ్ళకే మోడలింగ్ రంగంలోకి వచ్చింది. అందాల పోటీల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఆమె పేరు చంద్రిక రవి. తమిళ సినిమాలతో ఓ మోస్తరుగా పాపులర్ అయిన ఈ బ్యూటీ, తాజాగా తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన ఆడి పాడనుంది.. అదీ ఓ స్పెషల్ సాంగ్‌లో.

ఇంకేముంది.? అసలు ఈ చంద్రిక రవి ఎవరు.? అంటూ ఇంటర్నెట్‌లో దున్నేయడం మొదలు పెట్టారు నందమూరి అభిమానులు.
బాలయ్యతో సినిమా అంటే, చంద్రిక రవి దశ తిరిగనట్లేనని నందమూరి అభిమానులంటున్నారు.
Chandrika Ravi చీకటి గదిలో గ్లామర్ చితక్కొట్టుడు.!
తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే ఓ బీ-గ్రేడ్ సినిమా వచ్చిన విషయం విదితమే. ఆ సినిమా ఒరిజినల్ వెర్షన్‌లో దెయ్యం పాత్రలో నటించింది చంద్రిక రవి.
Also Read: అందమైన ఊచకోత.! నోరా ఫతేహీ స్పెషల్ సాంగ్స్.!
అన్నట్టు, చంద్రిక రవి సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తే, అందులో అందాల విధ్వంసమే.! డాన్స్ అంటే ఈ బ్యూటీకి చాలా చాలా ఇష్టమట. అందుకే స్పెషల్ సాంగ్స్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తానంటోంది ఈ బ్యూటీ.
తమిళ, తెలుగుతోపాటు, ఏ భాషలో అయినా సినిమాలు చేస్తానననీ, నటనకు భాష అడ్డంకి కానే కాదని చంద్రిక రవి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

స్కిన్ టోన్.. అదేనండీ ‘కలర్’ విషయమై మొదట్లో తాను కొంత ఇబ్బందికి గురైనప్పటికీ, అలాంటి అడ్డంకులన్నిటినీ జయించి మోడలింగ్ రంగంలో రాణించానని అంటోంది చంద్రిక రవి.
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
తమన్ సంగీతమంటే, అందులో స్పెషల్ సాంగ్స్‌కి వుండే ఇంపార్టెన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? చంద్రిక రవి తెలుగు తెరపై సరికొత్త ఐటమ్ బాంబులా బీభత్సమైన సౌండ్ ఇవ్వడం ఖాయమే.