Actress Hema Rave Party.. సినీ నటి హేమ వివాదాల్లోకెక్కింది. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో సినీ నటి హేమ పేరు ప్రచారంలోకి వచ్చింది.
అయితే, తాను రేవ్ పార్టీకి వెళ్ళలేదనీ, ఓ ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నానని ఓ వీడియో విడుదల చేసింది హేమ.
హేమ వివరణ నేపథ్యంలో, నిజంగానే ఆమె ఆ రేవ్ పార్టీకి వెళ్ళలేదని అనుకున్నారు.
Actress Hema Rave Party.. శ్రీకాంత్, జానీ, శ్యామల పేర్లు కూడా..
మరోపక్క, ఇదే రేవ్ పార్టీలో సినీ నటుడు శ్రీకాంత్ కూడా వున్నట్లు పుకార్లు షురూ అయ్యాయ్ కానీ, తాను హైద్రాబాద్‌లోనే వున్నట్లు ఆయన ఓ వీడియో విడుదల చేశాడు.
కాగా, సినీ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరుని కొందరు వైసీపీ నెటిజన్లు, ఈ రేవ్ పార్టీతో ముడిపెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చారు.

అది జానీ మాస్టర్ కాదని, వీడియో చూసినవారందరికీ అర్థమయ్యింది. తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి స్పందించారు జానీ మాస్టర్.
నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని.
అనవసరంగా నాపై, మా జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇది, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం.
ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మనస్థితి పై జాలేస్తుంది.
జానీ మాస్టర్ స్పందన
అంతేనా.? యాంకర్ శ్యామల పేరుని కూడా ప్రచారంలోకి తీసుకొచ్చారు కొందరు నెటిజనం. ఈ విషయమై యాంకర్ శ్యామల స్పందించాల్సి వుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయ ప్రముఖుడి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. వైసీపీ నేత, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి చెందిన కారుని ఈ రేవ్ పార్టీ జరిగిన చోట పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
బెంగళూరులో తెలుగు పరువు పాయె..
తనకూ ఆ రేవ్ పార్టీకి సంబంధమే లేదని మంత్రి కాకాణి రెడ్డి చెబుతున్నారు. మొత్తమ్మీద, ఈ రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.

తెలుగు టీడీ, సినీ రంగానికి చెందిన కొందరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికారన్నది బెంగళూరు పోలీసుల వాదన.
Also Read: Kushitha Kallapu: క్రికెట్ మైదానంలో అందాల కనికట్టు.!
ఇదిలా వుంటే, హేమ విడుదల చేసిన వీడియో విషయమై బెంగళూరు పోలీసులు స్పందించారు. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు.
మరో ట్విస్ట్ ఏంటంటే, హేమ విడుదల చేసిన వీడియోలో వున్న ఫామ్ హౌస్ కూడా బెంగళూరులోదేనని బెంగళూరు పోలీసులు తేల్చడం.