Actress Ivana Single.. అలీనా షాజీ.. ఆ అమ్మాయి అసలు పేరు. కానీ, స్క్రీన్ నేమ్ వచ్చేసరికి ఇవానా. ఇంతకీ ఎవరీ ఇవానా.? తెలుగులో ఇంతవరకూ సినిమాలు చేసిందా.? అంటే లేదు.
ఓ తమిళ డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ‘లవ్ టుడే’ అనే టైటిల్‌తో వచ్చిన తెలుగు సినిమా గుర్తుండే వుంటుంది.
గతేడాది ఈ సినిమా ఓ ట్రెండింగ్. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మే ఇవానా. స్క్రీన్ మీద అమ్మడు చాలా చాలా యాక్టివ్.
Actress Ivana Single.. చైల్డ్ ఆర్టిస్టుగానూ..
తమిళంతో పాటూ కొన్ని మలయాళ సినిమాల్లోనూ నటించింది. తెలుగు ప్రేక్షకులకు ఎలాగూ పరిచయమైంది కాబట్టి.. ఇప్పుడు డైరెక్ట్‌గా ఓ తెలుగు సినిమాలోనూ నటించేస్తోంది.
అదే శ్రీవిష్ణు హీరోగా వస్తున్న ‘హ్యాష్ ట్యాగ్ సింగిల్’. ఈ సినిమాలో శ్రీవిష్ణు (Sree Vishnu) సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు.
అందులో ఒకరు కేతిక శర్మ (Ketika Sharma) కాగా, ఇంకో ముద్దుగుమ్మే ఈ ఇవానా. లేటెస్ట్‌గా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని ప్రమోట్ చేసిన విధానం ఆకట్టుకుంది.

అఫ్‌కోర్స్.! ఫస్ట్ సింగిల్ కూడా బాగానే వుందనుకోండి లవ్‌లీగా. చూస్తుంటే ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనిపిస్తోంది.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, సోషల్ మీడియాలో ఇవానా పాప చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.
దాంతో ఇంతకీ ఎవరీ ఇవానా.? అంటూ ఆరా మొదలైంది. అలా ఆరా తీస్తేనే అమ్మడి టాలెంట్ బయటపడింది.
హీరోయిన్ కాకముందు, చైల్డ్ ఆర్టిస్టుగానూ కొన్ని సినిమాల్లో నటించింది ఇవానా (Ivana). హీరోయిన్ చిన్నప్పటి రోల్స్‌లో నటించి శభాష్ అనిపించుకుంది.
అన్నట్లు రీసెంట్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘డ్రాగన్’ మూవీలోనూ ఇవానా ఓ చిన్న రోల్ పోషించిందండోయ్.
ఇక, ఇప్పుడు ‘హ్యాష్‌ట్యాగ్ సింగిల్’ సినిమాతో పాప అసలు సిసలు టాలెంట్ తెలుగు ప్రేక్షకులకి తెలియబోతోందన్న మాట. అదిదా సంగతి.!