తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ (Saaho Trailer Review) ఏ పెద్ద సినిమా వస్తున్నా, ‘బాహుబలి’తో దాన్ని పోల్చలేకపోతున్నాం. నాన్ ‘బాహుబలి’ అని మాత్రమే అనగలుగుతున్నాం. ఎందుకంటే, ‘బాహుబలి’ అంత స్పెషల్.
కానీ, ఇప్పుడు ‘బాహుబలి’తో (Baahubali) పోల్చదగ్గ స్థాయి సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమా ‘సాహో’. ప్రబాస్‌కి ప్రబాస్ మాత్రమే పోటీ. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఇప్పుడిదే నిజం. ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’.. వీటి ఈక్వేషన్లు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం.
‘సాహో’ (Saaho) గురించి దేశమంతా చర్చించుకుంటోంది. ఈ నేపథ్యంలో ‘సాహో’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ట్రైలర్ కాదు, సినిమా చూసేశాం అన్న భావన చాలా మందిలో కలిగిందంటే, అది అతిశయోక్తి కాకపోవచ్చు. ఆ విజువల్స్ ఏంటీ.? ప్రబాస్‌లో ఆ కాన్ఫిడెన్స్ ఏంటీ.? అందరికీ చాలా పెద్ద షాక్ ఇచ్చింది.
చాలా బాలీవుడ్ సినిమాల్లో భీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ చూశాం. మన తెలుగు సినిమా కూడా యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో బాలీవుడ్‌కి పోటీ ఇవ్వడమేంటీ.? బాలీవుడ్ స్థాయిని దాటేసింది. ‘సాహో’ ఈ యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా, తెలుగు సినిమాని ఇంకో మెట్టు పైకెక్కిస్తోంది. ఆ స్థాయిలో ఉన్నాయి ‘సాహో’లో యాక్షన్ ఎపిసోడ్స్.
‘గల్లీలో ఎవడైనా సిక్సర్ కొడతాడు. స్టేడియంలో సిక్సర్ కొడితే ఓ రేంజ్ ఉంటుంది..’ అని ప్రబాస్ చెప్పిన డైలాగ్, మొత్తం ట్రైలర్‌కే హైలైట్. నిజమే, ‘బాహుబలి’తో ప్రబాస్ కొట్టిన సిక్సర్ అలాంటిలాంటిది కాదు. ఇప్పుడు కొట్టబోతున్నది అంతకు మించి ఉండబోతోందనే సంకేతాలైతే స్పష్టంగా పంపేశారు. ‘బాహుబలి’ మార్కెట్ చూశాక, ‘సాహో’ మార్కెట్ గురించి, అనుమానాలు అవసరం లేదు.
ఎందుకంటే, ‘సాహో’ (Saaho Trailer Review) ట్రైలర్ ప్యాన్ ఇండియా రేంజ్‌లోనే ఉంది. ఆ మాటకొస్తే, అంతకన్నా ఎక్కువే ఉంది. ఇప్పటిదాకా, ఎవరికైనా చిన్న చిన్న అనుమానాలుంటే, అవన్నీ ఈ రోజుతో పటాపంచలైపోయినట్లే. సినిమాటోగ్రఫీ, స్టంట్ కొరియోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇలా ఒక్కటేమిటి మొత్తంగా చూస్తే, ఇదో కంప్లీట్ ప్యాకేజ్.
ఈ మధ్య కాలంలో ఇంత పర్‌ఫెక్ట్ ప్యాకేజీతో వచ్చిన ట్రైలర్ ఇంకోటి లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఓ పెద్ద గ్యాంగ్, వాళ్లు చేసే దోపిడీ, ఆ గ్యాంగ్‌ని పట్టుకునేందుకు నియమితురాలైన ఓ లేడీ ఆఫీసర్ (శ్రద్ధా కపూర్), ఆమెకు అండగా అండర్ కవర్ ఆఫీసర్ (ప్రభాస్).. ఇదీ ‘సాహో’ సినిమా అసలు కథ. ట్రైలర్‌లో (Saaho Trailer Review) రివీల్ చేసిందిదే. సినిమాలో ఏముండబోతోందో.? ‘సాహో’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయబోతోందో.? వెయిట్ అండ్ సీ.