Adipurush Hanuman Cinema Business.. ఏరు దాటాక తెప్ప తగలెయ్యడమేంటో తెలుసా.? ఇది రామాయణం కాదు.. ఈ సినిమా పేరు ‘ఆదిపురుష్’ అని చెప్పడమే.!
అంతేనా.? హనుమంతుడికి సినిమా థియేటర్లలో ప్రతి షో కోసం ఓ టిక్కెట్టుని రిజర్వ్ చేసిన ‘ఆదిపురుష్’ టీమ్, ఇప్పుడేమో హనుమంతుడు దేవుడే కాదంటోంది.!
నవ్విపోదురుగాక ‘ఆదిపురుష్’ (Adipurush) టీమ్‌కి ఏంటి సిగ్గు.? ఔను, సిగ్గూ ఎగ్గూ వదిలేశారు.! భయమూ లేదు.. భక్తీ లేదు.!
Adipurush Hanuman Cinema Business.. సినిమా పబ్లిసిటీ భక్తి..
‘ఆదిపురుష్’ సినిమా విషయంలో ఎంత యాగీ చేశారు.? ‘రామాయణం’ అన్నారు.! శ్రీరాముడన్నారు.. సీతాదేవి అన్నారు.. ‘జై శ్రీరాం’ అంటూ నినదించారు.
సీన్ మారిపోయింది. మీరొకటి గుర్తుంచుకోవాలి.. సినిమా పేరు ‘ఆదిపురుష్’ (Adipurush) మాత్రమే.. ఇది రామాయణం కాదని.. స్వయంగా సినిమా టీమ్ ప్రకటించేసింది.

సో, హనుమంతుడు (Adipurush Hanuman) దేవుడు కాదని ‘ఆదిపురుష్’ టీమ్ ప్లేటు ఫిరాయించడంలో వింతేమీ లేదు.
నిజమేనా.? దేవుడు కాదా.?
శ్రీరాముడు దేవుడైతే.. హనుమంతుడు దేవుడైతే.. ‘ఆదిపురుష్’ టీమ్‌ని శిక్షించాలి కదా.? ప్రపంచంలో చాలా నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయ్.. దేవుడు శిక్షించడంలేదా.? ఏమో, అంతేనేమో.!
దేవుడెలాగూ శిక్షించడన్న ధైర్యం ‘ఆదిపురుష్’ (Adipurush) టీమ్‌లో వుండబట్టే, ‘ఆదిపురుష్’ సినిమాని అంత అడ్డగోలుగా తీశారు.
ప్రేక్షక దేవుళ్ళూ అంతేనేమో.! తమను నమ్మించి మోసం చేసిన, ‘ఆదిపురుష్’ టీమ్ మీద తిరగబడటంలేదెందుకో.!
Also Read: Rakesh Master.! అదే చంపేసింది.!
కాదు కాదు.. ఇదంతా జస్ట్ పబ్లిసిటీ స్టంట్.! వివాదం రాజేసి, కాసుల పంట పండించుకోవాలని చూస్తోంది ‘ఆదిపురుష్’ టీమ్.!
సినిమా రిలీజ్ అయ్యాక ‘ఆదిపురుష్’ హీరో ప్రభాస్ (Adipurush Prabhas) ఎవరికీ కనిపించలేదు. దీనర్థమేంటి.? సినిమా అంటే జస్ట్ వ్యాపారం.!
బిజినెస్ కోసం ప్రమోషన్స్ చేసుకున్నారు.. అంతే, ఆ తర్వాత ఇదిగో ఇలా ప్లేటు ఫిరాయించేశారు.! అంతేనా.? అంతేనేమో.!
ఎంత వ్యాపారం అయితే మాత్రం.? ఇంత హేయమా.? ఇది నిస్సిగ్గు సినీ వ్యాపారం.!