Agent Disaster Anil Sunkara.. ఇదెక్కడి పంచాయితీ.? సినిమా హిట్టవడం, ఫ్లాప్ అవడం వెనుక చాలా కారణాలుంటాయి.
అనుకున్న రీతిలో సినిమా తీసి వుండకపోవచ్చు, రిలీజ్ సమయానికి ట్రెండ్ మారి వుండొచ్చు.! ఇంకేవో కారణాలూ వుండొచ్చు.!
ఔను, సినిమా హిట్టవడానికీ చాలా కారణాలుంటాయి. ఒక్కోసారి కంటెంట్ లేని సినిమాలు హిట్టవుతాయ్.. కంటెంట్ వున్న సినిమాలు అనూహ్యంగా డిజాస్టర్ అవుతుంటాయి.!
Agent Disaster Anil Sunkara.. మోసం చేసినట్టే కదా.?
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) నటించిన ‘ఏజెంట్’ (Agent Movie) సినిమా డిజాస్టర్ అయి కూర్చుంది. సినిమా పట్ల అక్కినేని అభిమానులే సంతృప్తిగా లేరు.
ఒక యంగ్ హీరో భవిష్యత్తు.. లక్షలాది మంది అభిమానుల మనోభావాలు.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల జీవితాలు.. కోట్ల రూపాయల బడ్జెట్.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా.. నిర్లక్ష్యంగా.. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా.? జస్ట్ నాన్సెన్స్.!
Mudra369
ఈ నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేశారు. ‘అంచనాలు అందుకోలేకపోయాం..’ అని చెప్పేసి వుండొచ్చు.
కానీ, బౌండెడ్ స్క్రిప్ట్.. అంటూ అసలు విషయాన్ని చెప్పేశారు. ఇది నిజాయితీ.. అని నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) అనుకుని వుండొచ్చు.
ఏం పద్ధతి ఇది.?
బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే సినిమాని పట్టాలెక్కించడమంటే, దాన్నేమనుకోవాలి.? దర్శకుడు.. రచయిత.. ఈ ఇద్దరిలో ఎవరిది తప్పు.? నిర్మాత తప్పెంత.?

హీరో ఎలా ఈ సినిమాని పట్టాలెక్కించడానికి ఒప్పుకున్నాడు.? అంతా కలిసి పెద్ద మోసానికి పాల్పడినట్లు, నిర్మాత అనిల్ సుంకర ప్రకటన వుంది.!
అంతే కదా మరి.! సినిమా పబ్లిసిటీలో భాగంగా చాలా కబుర్లు చెప్పారు. ఇప్పుడేమో, బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే సినిమాని తెరకెక్కించేశామంటూ చావు కబురు చల్లగా చెబుతున్నారు.
Also Read: మహేష్ – త్రివిక్రమ్ సినిమాపై రూమర్స్.! ఈ పిట్ట కథేంటి.?
గతంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు, నటులు, దర్శకులు స్పందించారు.. తమ తప్పుల్ని అంగీకరించారు. కానీ, ఇలా ఇంతవరకు ఎవరూ చెప్పి వుండరేమో.!
నమ్మి, సినిమాని కొనుగోలు చేసిన పంపిణీదారులు, టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులు.. అందరూ మోసపోయినట్టే కదా.!
మోసం చేశామని ఎలా చెప్పగలుగుతున్నారు చెప్మా.?