Agneepath Scheme Politics.. సైన్యంలో ఉద్యోగాలకు మాత్రమే ఎందుకు.? రాజకీయాలకు కూడా అగ్నిపథ్ స్కీమ్ ఆపాదిస్తే బావుంటుంది కదా.?
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిథుల విషయంలో అగ్నిపథ్ లాంటి స్కీమ్ అమలు చేస్తే ఎలా వుంటుంది.?
సామాన్యుడికి వస్తున్న ఈ ధర్మ సందేహానికి బదులిచ్చేదెవరు.? క్రిమినల్ కేసులుంటే ఉద్యోగాలకు అనర్హులవుతారు.
మరి, అవే క్రిమినల్ కేసులున్న రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిథులెలా అవుతున్నారు.? మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులెలా అవుతున్నారు.? కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఇది.
రాజకీయాల్లోకి నేరచరితులు.! అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.!
చిత్రమేంటంటే, క్రిమినల్ హిస్టరీ వున్న నాయకులు చట్ట సభలకు వెళుతున్నారు. అలాంటోళ్ళు చేసే నిర్ణయాల్ని, ఎలాంటి నేర చరిత లేని సామాన్యులు భరించాల్సి వస్తోంది.
అందుకే, అగ్నిపథ్ స్కీమ్ (Agnipath Scheme) ముందుగా రాజకీయాలకు వర్తింపజేయాలి. ఐదేళ్ళకోసారి ఎన్నికలు జరుగుతాయ్ కాబట్టి, స్కీమ్ గడువు ఐదేళ్ళని అనుకుందాం.

ఐదేళ్ళ తర్వాత 75 శాతం మంది ప్రజా ప్రతినిథులకు సర్టిఫికెట్లు ఇచ్చి బయటకు పంపేయాలి. వాళ్ళసలు ఇంకోసారి నామినేషన్ వేసే పరిస్థితి వుండకూడదు.
Agneepath Scheme Politics.. ఈ రాజకీయం ఏమైపోతుంది.?
మిగిలిన పాతిక శాతం మంది మాత్రమే మళ్ళీ నామినేషన్ వేసే వెసులుబాటు కలిగి వుండాలి. అలా చేస్తే, కొత్తగా 75 శాతం మంది రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వుంటుంది. రాజకీయాల్లోకి వచ్చేవారికి ‘నేర చరిత’ అస్సలు వుండకూడదు.
Also Read: నువ్వు నాశనం చేసిన మట్టి.! నిన్ను ఇంకా బతికిస్తోంది.!
ఇలా ఓ సామాన్యుడు ఆలోచిస్తున్నాడు. రాజకీయాల్లో (Politics) తొలుత ప్రక్షాళన జరిగితే, వ్యవస్థలన్నీ ప్రక్షాళనకు గురైనట్టే.
కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? అయినాగానీ, కట్టి తీరాల్సిందే. ఎప్పుడో ఒకప్పుడు మార్పు వచ్చి తీరాల్సిందే.. అలాంటప్పుడు, ఇప్పుడే ఆ మార్పు మొదలైతే ఎంత బావుంటుంది.?
అగ్నిపథ్ స్కీమ్ గురించి, రాజకీయ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. తెలిసిందొకటి, మాట్లాడుతున్నది ఇంకోటి. దేశానికి రక్షణ కల్పించే సైనికుల విషయంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలా.?
దీనికి మళ్ళీ కార్పొరేట్లు వంత పాడటమొకటి. నాలుగేళ్ళ తర్వాత ఉద్యోగం కోల్పోయే సైనికులకి, తమ సంస్థల్లో ఉపాధి కల్పించేస్తారట.
నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం. సైన్యమంటే త్యాగం. ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని కాపాడటమే వారి కర్తవ్యం. అలాంటి సైన్యానికి స్కీములు పెట్టడమా.?