Agni Prime Missile India.. భారత రక్షణ రంగంలో సంచలనాత్మక నిర్ణయాలు, ఆపరేషన్ సింధూర్‌కి ముందు.. ఆ తర్వాత.. చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి.!
అత్యాధునిక యుద్ధ విమానాల్ని సమకూర్చుకోవడం, యుద్ధ రంగాన డ్రోన్ల వినియోగంపై మరింత విప్లవాత్మక నిర్ణయాలు.. ఇలా చాలానే చూస్తున్నాం.
సరిగ్గా, ఈ ససమయంలోనే.. అత్యంత కీలకమైన మిస్సైల్ పరీక్షను నిర్వహించింది బారత రక్షణ రంగం. అది కూడా, రైలు మీద నుంచి లాంఛ్ చేయగల మిస్సైల్‌ని పరీక్షించడం గమనార్హం.
Agni Prime Missile India.. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్ళిన అగ్ని..
భారత మిస్సైల్స్‌లో అత్యాధునికమైనదిగా అగ్ని ప్రైమ్ గురించి చెప్పుకుంటుంటాం. ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిస్సైల్, అగ్ని ప్రైమ్ ప్రయోగం తాజాగా జరిగింది.
నిజానికి, అగ్ని సిరీస్‌లో ఐదు వేల కిలోమీటర్లు.. ఆ పై దూరం దూసుకెళ్ళగల మిస్సైళ్ళు కూడా వున్నాయి. తాజా క్షిపణి పరిధి రెండు వేల కిలోమీటర్లు.
సంప్రదాయ పేలోడ్ సహా, అణ్వాయుధాల్ని మోసుకెళ్ళగల శక్తి సామర్థ్యాలు అగ్ని క్షిపణి సొంతం. శతృ దేశ రాడార్లకు చిక్కకుండా నింగిలోకి అత్యంత వేగంగా దూసుకెళుతుంది అగ్ని.
అగ్ని ప్రైమ్ తాజా మిస్సైల్ ప్రయోగం విషయానికొస్తే, దీన్ని రైల్వే ట్రాక్ మీద నుంచి ప్రయోగించారు.. అంటే, మొబైల్ లాంఛర్ సాయంతో అన్నమాట.
లక్ష్య ఛేదనలో అత్యంత ఖచ్చితత్వం..
ప్రత్యేకంగా వినియోగించిన రైలు ద్వారా, అగ్ని ప్రైమ్ మిస్సైల్ టెస్ట్ జరిగింది. నిర్దేశించిన అన్ని లక్ష్యాల్నీ అగ్ని ప్రైమ్ ఛేదించినట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
యుద్ధ సమయాల్లో అత్యంత వ్యూహాత్మకంగా, అగ్ని ప్రైమ్ మిస్సైళ్ళను దేశంలో ఏ ప్రాంతానికి అయినా రైలు మార్గం ద్వారా తరలించి, అక్కడి నుంచే ప్రయోగించవచ్చు.
Also Read: అలాంటోడు మళ్ళీ తిరిగొస్తే.!
భారత రక్షణ రంగం, ఇప్పటికే మొబైల్ లాంఛర్ల ద్వారా మిస్సైళ్ళను ప్రయోగించే అనేక పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించింది.
అయితే, భారీ మిస్సైల్‌ని.. అది కూడా, అగ్ని ప్రైమ్ లాంటి ప్రత్యేకమైన మిస్సైల్‌ని రైలు లాంఛర్ నుంచి ప్రయోగించడం ఇదే ప్రథమం.
