Table of Contents
Sajjala Ramakrishna Reddy Sankara.. రోజు రోజుకీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, పతనంలో అత్యంత దిగజారుడుతనాన్ని వెతుక్కుంటోంది.!
వైసీపీ సొంత ఛానల్ సాక్షిలో, ఓ జర్నలిస్టు చేసిన ‘సెక్స్ వర్కర్లకు కేంద్రంగా అమరావతి’ అనే వ్యాఖ్యలతో దుమారం ముదిరి పాకాన పడిన సంగతి తెలిసిందే.
సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలవి.
Sajjala Ramakrishna Reddy Sankara.. అప్పుడే ఖండించేసి వుంటే..
సాక్షికీ, జర్నలిస్టు కృష్ణంరాజుకీ సంబంధం లేదు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఆయన చేసినప్పుడు, సాక్షి యాజమాన్యం ఏం చేయాలి.? ఖండన ప్రకటన విడుదల చేయాలి.
అప్పటికప్పుడే, జర్నలిస్టు కృష్ణంరాజుతో లైవ్‌ని కట్ చేసి వుండాలి హోస్ట్‌గా వ్యవహరించిన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు. కానీ, అదీ జరగలేదు.
పైగా, వైసీపీ శ్రేణులు జర్నలిస్టు కృష్ణం రాజు వ్యాఖ్యల వీడియోల్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడంతో, వివాదం మరింతగా ముదిరిపోయింది.
సంకర తెగ అంటే ఏంటి సజ్జలా.?
అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ‘సంకర తెగ’ అంటూ మహిళలపై చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి.
సాక్షిలో జరిగిన వ్యవహారంపై, మహిళలు మండిపడుతూ సాక్షి కార్యాలయం యెదుట ఆందోళన చేశారు. ఈ క్రమంలో కొందరు మహిళలు కార్యాలయంలోకి దూసుకెళ్ళారు.
ఈ ఘటనపై అసహనంతో ఊగిపోయిన సజ్జల రామకృష్ణా రెడ్డి ‘సంకర తెగ’ అంటూ మహిళలపై చేసిన వ్యాఖ్యలతో, యావత్ మహిళా సమాజం భగ్గుమంటోంది.
తప్పు మీద తప్పు..
ఓ తప్పు జరిగిన్పప్పుడు.. ఆ తప్పని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.. అది మానేసి, తప్పు మీద తప్పు చేస్తూ, విపరీత వ్యాఖ్యలు చేస్తూ, వైసీపీ నేతలు మరింతగా దిగజారిపోతున్నారు.
Also Read: అర్జున్ సన్నాఫ్ వైజయంతి సమీక్ష: ఆ నరుక్కోవడం జుగుప్సాకరం.!
ఇంత జరుగుతున్నా, ‘డ్యామేజ్ కంట్రోల్’ అనేది పార్టీ పరంగా జరగకపోవడంతో, వైసీపీలోని కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తొలుత అమరావతి మహిళలు, ఇప్పుడేమో యావత్ మహిళా సమాజం.. వైసీపీని ‘చీడపురుగులా’ చూసే పరిస్థితి వచ్చింది. ఇదంతా వైసీపీ స్వయంకృతాపరాధమే.