Aishwarya Rajesh Glamarasam.. ఐశ్వర్య రాజేష్ అంటేనే హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ గుర్తొస్తుంటాయ్. ఐశ్వర్య ఏ పాత్ర ఎంచుకున్నా.. ఆ పాత్రకు ప్రాధాన్యం వుండేలా చూసుకుంటుంది.
అలాగే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంది. సహజమైన నటనతో ఆకట్టుకుంటుంది ఐశ్వర్యా రాజేష్.
కథల ఎంపికలోనూ తనదైన స్టైల్ చూపిస్తుంటుంది. అందుకే ఐశ్వర్యా రాజేష్‌కి అటు తమిళ సినిమాలతో పాటూ, ఇటు తెలుగులోనూ స్పెషల్ ఫ్యాన్ బేస్ వుంటుందనడం అతిశయోక్తి కాదు.

సీరియస్ పాత్రలతో పాటూ, కామెడీ రోల్స్‌లోనూ ఐశ్వర్యా రాజేష్ అలరించిన సందర్భాలున్నాయ్.
అన్నింటికీ మించి రీసెంట్గా తెలుగులో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఐశ్వర్యా రాజేష్ కెరీర్లోనే డిఫరెంట్ అండ్ బెస్ట్ ఎంటర్టైనింగ్ రోల్ అని చెప్పొచ్చు.
Aishwarya Rajesh Glamarasam.. బ్యూటీ ఆఫ్ స్మైల్..
విక్టరీ వెంకటేష్‌కి జోడీగా వచ్చిన ఈ సినిమాలో భాగ్యలక్ష్మిగా ఐశ్వర్య రాజేష్ పోషించిన పాత్ర తెలుగు లోగిళ్లలో భలే నవ్వులు పూయించింది. ఈ సినిమా ఐశ్వర్యకి సూపర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
గ్లామరస్ రోల్స్ కన్నా.. ఎక్కువగా నటన ప్రాధాన్యత వున్న పాత్రలకే స్క్రీన్‌పై ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటుందీ చెన్నై బ్యూటీ.

అలాగని గ్లామర్లోనూ ఏమాత్రం తక్కువ కాదండోయ్ ఐశ్వర్యా రాజేష్. అందుకు నిదర్శనం. తాజాగా ఆమె చేయించుకున్న ఫోటో షూట్‌నే.
స్టైలింగ్‌లోనూ ఐశ్వర్య రూటే సెపరేటు.!
గ్లామర్ అంటే కేవలం పొట్టి దుస్తుల్లోనే వుంటుందంటే ఐశ్వర్య రాజేష్ అస్సలు ఒప్పుకోదు. ఇదిగో ఇలాంటి డిఫరెంట్ కాస్ట్యూమ్లోనూ గ్లామర్ ఒలకబోయచ్చు.
పింక్ కలర్ బెనారస్ ప్యాటర్న్‌తో డిఫరెంట్‌గా డిజైన్ చేయించిన ఈ లాంగ్ సూట్ ఐశ్వర్య కోసమే డిజైన్ చేయించినట్లు లేదూ.

ఈ ప్యాటర్న్‌కి పర్పుల్ కోట్ కాంబినేషన్ అదిరింది. అలాగే, కాంట్రాస్ట్ హెవీ కంఠాభరణం ఐశ్వర్య రాజేష్ స్టైలింగ్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లిందనొచ్చు.
Also Read: వెబ్..చారమ్: పాత్రికేయమంటే.! పక్కలెయ్యడమే..నా.?
చక్కని చుక్క ఐశ్యర్య ఏం చేసినా తనదైన ప్రత్యేక ముద్ర వుండాలనుకుంటుంది.
అందుకే ఈ డిఫరెంట్ డిజైనర్ వేర్లో తళుక్కున మెరిసిపోతూ ఫోటోలకు పోజిచ్చింది. ఆహా.! ఏమా రాజసం.! నిజంగా ‘ఐశ్వర్య’మే సుమీ.!
