Akanksha Puri Bigg Boss.. బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి వున్న క్రేజ్ ఎప్పుడూ వేరే లెవల్ అని చెప్పొచ్చు.
అదేంటో.. తిట్టుకుంటూనే జనం ఈ షోని చూసేస్తుంటారు. అందుకే అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్ షో అంతలా పాపులారిటీ దక్కించుకుంది.
ఇటీవల ఓటీటీ (Bigg Boss OTT) ట్రెండ్ మొదలైన నేపథ్యంలో బిగ్‌బాస్ ఓటీటీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.
గతంలో ఓటీటీ వేదికగా తెలుగు బిగ్ బాస్ (Bigg Boss Telugu) ఎంతలా ట్రెండింగ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తెలుగమ్మాయ్ బిందు మాధవి (Bindu Madhavi) ఆ సీజన్ ఓటీటీకి విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక, ఇప్పుడు హిందీలో ఓటీటీ బిగ్ బాస్ సందడి మొదలైంది.
Akanksha Puri Bigg Boss OTT Hindi.. ఈ సీజన్ ‘బిగ్’ క్వీన్ అవుతుందా.?
ఈ సారి కూడా సల్మాన్ ఖాన్ హోస్టింగ్‌లోనే ఓటీటీ బిగ్‌బాస్ సీజన్ కలర్ ఫుల్‌గా ముస్తాబైంది. కాగా, ఈ సీజన్ ఓటీటీ బిగ్ బాస్ (Bigg Boss) కంటెస్టెంట్లలో భోపాల్ బ్యూటీ ఆకాంక్ష పురి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
మొదటి నుంచీ ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఆకాంక్ష పురి అట్టాంటిట్టాంటి అమ్మాయ్ కాదండోయ్.

షి ఈజ్ మల్టీ టాలెంటెడ్. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌లో ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూలో పనిచేసింది ఆకాంక్ష పురి. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, ఇంకో వైపు మోడలింగ్‌లోనూ రాణించింది.
అమ్మో.! ఇంత టాలెంటే.!
పలు బ్రాండ్స్‌కి ప్రచార కర్తగా పనిచేయడంతో పాటూ, కమర్షియల్ యాడ్స్‌లోనూ నటించింది. ఆ తర్వాత ‘అలెక్స్ పాండియన్’ సినిమాతో సౌత్‌లో తెరంగేట్రం చేసింది
కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించింది.. తెలుగు సినిమాల్లో నటించాలని వుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఆకాంక్ష పురి. దాంతో, మనోళ్లు ఈ ముద్దుగుమ్మని ఓన్ చేసేసుకున్నారు.
Also Read: సైకాలజిస్ట్ కాజల్.! బాలయ్యపై ఎన్టీయార్ ఫ్యాన్స్ ట్రోలింగ్.!
అన్నట్లు ఈ ముద్దుగుమ్మ సింగర్ కూడానండోయ్. ఓ సింగింగ్ రియాల్టీ షోలో పాల్గొని విన్నర్‌గా బయటికి వచ్చింది.
అలాగే, డాన్స్ అంటే తనకు ప్రాణమంటోంది ఈ బ్యూటీ (Akanksha Puri). పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించింది.
ఇన్ని టాలెంట్స్ వున్న ఆకాంక్ష పురికి సోషల్ మీడియా వేదికగా 2.7 మిలియన్ల ఫాలోవర్లున్నారు. బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ అంటే చచ్చేంత అభిమానమంటూ ముందే పేద్ద బిస్కెట్ వేసేసింది.

ఇక, బిగ్‌బాస్ షో విషయానికి వస్తే, ఆకాంక్ష పురికి బిగ్ హౌస్ కొత్తేమీ కాదు, గతంలో గెస్ట్‌గా, ఛాలెంజర్‌గా రెండు సార్లు ‘బిగ్’ హౌస్‌లో అడుగు పెట్టి వచ్చింది ఆకాంక్ష.
ఇన్ని స్పెషల్ టాలెంట్స్ వున్న ఆకాంక్ష పురి (Akanksha Puri) ఇప్పుడు కంటెస్టెంట్‌గా ఓటీటీ బిగ్‌బాస్‌లో ఎంత మేర తన టాలెంట్ చూపించబోతుందా.?
అది తెలియాలంటే బిగ్‌బాస్ హిందీ ఓటీటీని వీలు చిక్కినప్పుడల్లా ఓ లుక్కేస్తే పోలా.!