Home » దీపిక పదుకొనేకి ఆ ‘స్పిరిట్’ లేదా.?

దీపిక పదుకొనేకి ఆ ‘స్పిరిట్’ లేదా.?

by hellomudra
0 comments
Deepika Padukone

Deepika Padukone Spirit.. అదేంటీ, దీపిక పదుకొనేకి ఆ ‘స్పిరిట్’ లేకపోవడమేంటి.? దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎందుకు, ‘స్పిరిట్’ సినిమా నుంచి ఆమెని తీసేశాడు.?

ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా దీపిక పదుకొనేని ఎంపిక చేశారు గతంలో.

కానీ, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి దీపిక పదుకొనే తప్పుకుందిట. కాదు కాదు, తప్పించారట. తప్పించింది కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అట.!

Deepika Padukone Spirit.. దీపిక కంటే బెస్ట్ ఆప్షన్ ఎవరు.?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా అంటే, తన కథకి ఏ హీరోయిన్ అయితే సూట్ అవుతుందో, ఆ హీరోయిన్‌తోనే సినిమా చేస్తాడాయన.

అలా, ‘స్పిరిట్’ ప్రాజెక్టులోకి దీపిక పదుకొనే వచ్చింది. వచ్చినట్టే వచ్చి, వెళ్ళిపోయింది. మరి, దీపిక కంటే బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ‘స్పిరిట్’ సినిమాకి ఎవరున్నారు.?

మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే పేరుని ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. పూాజా హగ్దే, కృతి సనన్.. ఇలా బోల్డన్ని పేర్లు వరుసగా దూసుకొస్తున్నాయ్.

అసలేం జరిగింది.?

దర్శకుడికీ, హీరోయిన్‌కీ ఎక్కడ తేడా వచ్చింది.? ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపిక ఎందుకు తప్పుకుంది.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ సినిమా అంటే, పాన్ ఇండియా సినిమా.! సందీప్ రెడ్డి వంగా గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఈ కాంబినేషన్ ఓ సంచలనం.

Also Read: సమీక్ష ‘ఓదెల-2’: ఓటీటీలో ఉచితమే అయినా, టైమ్ వేస్ట్!

మరి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి దీపిక తప్పుకోవడమో, తప్పించబడటమో.. ఎందుకు జరిగినట్లు.? క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటే ఏంటి.? ఇవన్నీ ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్స్.

తాను రాసుకున్న కథ విషయంలో అస్సలేమాత్రం కాంప్రమైజ్ అవడు సందీప్ రెడ్డి వంగా. దీపిక ఏమైనా ఛేంజెస్ అడిగిందా.? ఏమో, ఈ మొత్తం వ్యవహారంపై సందీప్ రెడ్డి వంగా ఏమంటాడో మరి.!

ఇంతకీ, దీపిక వెర్షన్ ఏంటి.? అన్ని ప్రశ్నలకూ సమాధానాలు దొరకాలంటే, కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group