Akhanda2 Thaandavam FDFS.. నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ-2’ గత వారమే విడుదల కావాల్సి వున్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈ రోజు ప్రీమియర్స్.. అంటూ హంగామా జరుగుతున్నా, ఎక్కడో ఏదో ఓ మూల చిన్న అనుమానం, నందమూరి బాలయ్య అభిమానుల్ని ఒకింత ఇబ్బంది పెడుతూ వచ్చింది.
ఎలాగైతేనేం, ‘అఖండ-2’ సినిమాకి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు టిక్కెట్ల ధరల పెంపుకీ, ప్రీమియర్లకీ అనుమతినిచ్చాయి.
Akhanda2 Thaandavam FDFS,, చివరి నిమిషంలో ఇబ్బందులొచ్చినా..
తెలంగాణలో చివరి నిమిషంలో టిక్కెట్ల ధరల విషయమై రచ్చ జరిగినా, ప్రీమియర్స్‌కి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు.
థియేటర్లలో బొమ్మ పడగానే.. బాలయ్య అభిమానుల ఆనందానికి అవధుల్లేండా పోయాయ్.

అన్నట్టు, వాయిదా పడినా, తద్వారా దొరికిన వారం రోజుల గ్యాప్.. సినిమాపై హైప్ మరింత పెరగడానికి ఉపకరించిందన్నది బాలయ్య అభిమానుల వాదనగా కనిపిస్తోంది.
Also Read: ప్రియాంక చోప్రా.. టాలీవుడ్‌లో డబుల్ ధమాకా.!
ఇంతకీ, ‘అఖండ-2’ ఎలా వుంది.? నందమూరి బాలకృష్ణ ‘తాండవం’ ఏ స్థాయిలో వుంది.? ‘అఖండ’కి కొనసాగింపు అయిన, ‘అఖండ-2’ అంచనాల్ని అందుకుందా.?
బ్రేక్ ఈవెన్ లెక్కలేంటి.? సినిమా ప్రీమియర్లతో చేయబోయే వసూళ్ళెంత.? మొదటి రోజు కొల్లగొట్టే వసూళ్ళ లెక్కలేమిటి.? ఇలా చాలా ప్రశ్నలున్నాయ్.
అన్ని ప్రశ్నలకీ కొద్ది సేపట్లోనే సమాధానాలు దొరకనున్నాయి. అప్డేట్స్ కోసం.. ఇద స్పేస్ చూస్తూ వుండండి.
