Ritu Varma Satyabhama.. తెలుగమ్మాయ్ రీతూ వర్మకి అందంతో పాటూ, అభినయమూ కూసింత ఎక్కువే. అదృష్టం కలిసొస్తే ఎక్కడికో వెళ్లిపోయేది.
జస్ట్ సపోర్టింగ్ రోల్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన రీతూ వర్మ, ఆ తర్వాత హీరోయిన్‌గా సత్తా చాటింది. ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.
హీరోయిన్‌గా తొలి అడుగులోనే తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నుంచీ వెనక్కి తిరిగి చూసుకోలేదు రీతూ వర్మ (Ritu Varma).
వరుసగా రీతూ వర్మ మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటూ వస్తోంది. అయితే, ఆశించిన రేంజ్‌లో స్టార్ హీరోయిన్ అయితే కాలేకపోతోందనుకోండి.
Ritu Varma Satyabhama.. ట్రెడిషనల్ హాట్‌నెస్..
ప్రస్తుతం తెలుగుతో పాటూ, తమిళ, మలయాళ భాషల్లోనూ తన అదృష్టం పరీక్షించుకుంటోంది. ఆల్రెడీ తమిళంలో క్రేజీ ప్రాజెక్టులు ఒప్పుకుంటోంది.
లేటెస్టుగా ఓ మలయాళ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. త్వరలోనే మరిన్ని మలయాళ ప్రాజెక్టుల్లోనూ రీతూ వర్మ నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

నటిగా ఓ వైపు గుర్తింపు తెచ్చుకుంటూనే మరో వైపు కమర్షియల్ ఇమేజ్ కోసం కూడా పాట్లు పడుతోంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రెచ్చపోతోంది.
తాజాగా ఎల్లో కలర్ డ్రస్‌లో రీతూ వర్మ ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే కావల్సినంత హాట్ అప్పీల్ కూడా పండిస్తోంది. ‘ఎల్లో ఎల్లో.. బ్యూటీ ’ఫుల్లు పిల్లో.! అంటూ ఈ పోజుల్లో రీతూ వర్మకు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు నెటిజనం.
Also Read: Samyuktha Menon: ‘విరూపాక్ష’పై గుస్సా.! మోసం చేశారా.?
భామవే.. సత్యభామవే.! అంటూ రీతూ వర్మ అభిమానులు ఆమె గ్లామర్‌కి ఫిదా అవుతున్నారంతే.! అవరా మరి.? అంతలా తన అందంతో కట్టి పడేస్తుంటేనూ.!