Akhil Akkineni Agent.. దర్శకుడు సురేందర్ రెడ్డి టాలెంట్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆయన సినిమాల్లో స్టైల్ వుంటుంది.. అది హాలీవుడ్ స్థాయిలో కనిపిస్తుంటుంది.
అలాంటి స్టైలిష్ డైరెక్టర్ చేతిలో కండలు తిరిగిన హీరో పడితే ఎలా వుంటుంది.? ‘ధృవ’ సినిమాలో రామ్ చరణ్ ఎలా కనిపించాడో చూశాం. అంతకు మించి.. అనేలా వున్నాడు అక్కినేని అఖిల్.!
కండలు తిరిగిన శరీరం మాత్రమే కాదు, అంతకు మించిన స్టైలిష్ అవతార్‌లో అఖిల్‌ని (Akkineni Akhil) చూపించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి (Director Surender Reddy).!
Akhil Akkineni Agent.. వాట్ ఏ స్టైలింగ్.. వాట్ ఏ మేకింగ్.!
టీజర్ చూస్తే ఎవరికైనా సరే మతిపోవాల్సిందే.! కాస్సేపు హాలీవుడ్ సినిమా చూస్తున్నామా.? అనిపిస్తుంది. అలా డిజైన్ చేశారు టీజర్‌ని.
అఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ సినిమా ఇది బడ్జెట్ పరంగా. నిజానికి, అఖిల్ మార్కెట్ చాలా చాలా తక్కువ. మరి, ఇంత రిస్క్ ఎందుకు చేసినట్లు.? ఎందుకంటే, కథలో సత్తా వుంది గనుక.. అనే మాట మేకర్స్ నుంచి వినిపిస్తోంది.
అక్కినేని అభిమానులైతే, ఇదీ అఖిల్ సత్తా.. అంటూ నినదిస్తున్నారు. నిజమే, ‘ఏజెంట్’ సినిమా పోస్టర్లతోనే పాన్ ఇండియా దృష్టిని తనవైపుకు తిప్పేసుకున్నాడు అఖిల్.

మంచి డాన్సర్, యాక్షన్ సీక్వెన్స్ చేయడంలో దిట్ట.. వాట్ నాట్, అఖిల్‌లో చాలా టాలెంట్స్ వున్నాయ్. కానీ, సరైన సినిమా ఇప్పటిదాకా పడలేదంతే.
‘ఏజెంట్’ ఇప్పటిదాకా అఖిల్ మీదున్న అన్ని ప్రశ్నలకు నిఖార్సయిన సమాధానమిచ్చే సినిమా అవుతుందనే ఖచ్చితమైన అభిప్రాయం అందరిలోనూ కలగజేస్తోంది.
ఇది కదా ఏజెంట్ అఖిల్ అంటే..
హీరోని మమ్ముట్టి ఇంట్రడ్యూస్ చేయడం దగ్గర్నుంచి, టీజర్ ఎండ్ అయ్యేవరకూ.. వాట్ ఏ ప్రోమో.. అనిపించకమానదు. గన్స్ పట్టుకుని, విలన్స్‌ని కాల్చి పారేస్తూ.. అఖిల్ ఎంజాయ్ చేస్తోంటే, ఆ కొరియోగ్రఫీకి హేట్సాఫ్ అనాల్సిందేనేమో.!
Also Read: ప్రియా ఆనంద్ చమత్కారం.! పటాసు పిల్లేనండోయ్.!
మొత్తమ్మీద, టీజర్‌తో సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశారు. మరి, ఆ అంచనాల్ని సినిమా అందుకుంటుందా.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!
అన్నట్టు కొత్తమ్మాయ్ సాక్షి వైద్య (Sakshi Vaidya) ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమవుతోంది.