కంటెస్టెంట్స్ చాలా చాలా కష్టపడుతున్నారు. అబిజీత్ మీద అఖిల్ (Akhil Sarthak Vs Abijeet BB4 Telugu) అరుస్తున్నాడు.. అఖిల్ మీద అబిజీత్ గుస్సా అవుతున్నాడు. వెళుతూ వెళుతూ మెహబూబ్ దిల్ సే చాలా డ్రామా పండించాడు.. దాన్ని మించేలా సోహెల్ ఏడ్చినట్లు నటించాడు.
‘అబ్బే, ఇది యాక్టింగ్ కాదు.. రియల్ ఎమోషన్..’ అంటూ సోహెల్ కవర్ డ్రైవ్‌ని కూడా చూశాం. అంత ఏడ్చేసి, మెహబూబ్ డాన్స్ ఎలా చేశాడో.. మెహబూబ్ వెళ్ళిన వెంటనే, హౌస్‌లో మళ్ళీ మజా ఎలా చేస్తున్నారో జనం చూడరా.? జనానికి అన్ని ఎమోషన్స్ తెలుసు.
ఎవరు ఏం చేస్తున్నారన్నదానిపై పక్కా ఐడియా వుంటుంది. సీక్రెట్ రూంలో ‘మమ్మీ..’ అంటూ ఏడ్చేసిన అఖిల్ సార్థక్, బయటకొచ్చాక.. ‘నేను పులి..’ అంటున్నాడు. ‘పులి’ ఎక్కడన్నా ఏడుస్తుందా ఎలిమినేషన్‌కి భయపడి. ‘స్ట్రాంగ్’ అన్న పేరుతో బయటకు పంపించడమంటే విన్నింగ్ టైటిల్ గెలిచినట్లే.
‘నన్ను ఎలిమినేట్ చేసెయ్యండి..’ అంటూ అఖిల్, స్ట్రాంగ్‌గా హోస్ట్ నాగార్జునని డిమాండ్ చేసి వుంటే.. అఖిల్ నిజంగానే విన్నర్ అనుకునేవాళ్ళం. ఇప్పుడేమో, ‘వీక్ కంటెస్టెంట్స్’ దగ్గరకి వెళ్ళాడు. ‘వాళ్ళంతా చాలా వీక్’ అని నాగ్‌తో అఖిల్ స్వయంగా చెప్పాడు.
సో, ఇప్పుడు ఒకవేళ అఖిల్ గెలిచినా.. అది గెలుపు ఎలా అవుతుంది.? బిగ్ బాస్ అంటేనే, జస్ట్ లాజిక్ లెస్. హారికని పట్టుకుని సోహెల్ ‘హైట్’ గురించి మాట్లాడేశాడు. నోటికొచ్చిన తిట్లు తిట్టేసి, ‘నేనింతే.. ఇలాగే వుంటా..’ అంటూ మళ్ళీ ‘కవర్ డ్రైవ్’ ఒకటి.
గత సీజన్లను బాగా ఫాలో అయిపోయారేమోగానీ.. కంటెస్టెంట్లు మేం చాలా బాగా స్టఫ్ ఇచ్చేస్తున్నాం.. అనే ఆలోచనతో విపరీతమైన ఓవరాక్టింగ్ చేసేస్తున్నారు. ఏం చేసినాసరే, ‘ఈసారి కష్టం బాస్’ అనే మాట ఆడియన్స్ నుంచి గట్టిగా వినిపిస్తోంది.
అందుకేనేమో, బిగ్‌బాస్ రేటింగ్.. గతంతో పోల్చితే బాగా డల్ అయిపోతోందని అంటున్నారు. ప్రత్యేక పరిస్థితుల నడుమ ఈ సారి బిగ్‌బాస్ నడుస్తోంది. నడుస్తోందనడం కంటే, సా..గు..తోందని అనడం కరెక్టేమో. మరీ ఇంత సాగతీత ఏంటబ్బా.? (Akhil Sarthak Vs Abijeet BB4 Telugu) అని జనం దీర్ఘాలు తీయాల్సి వస్తోంది.