కంటెస్టెంట్స్‌కి ఇంటి వారి వారి ఇంటి సభ్యుల నుంచి లెటర్స్ వచ్చాయి. వాటిని బిగ్‌బాస్, అఖిల్ ద్వారా ఇప్పించాలి. సీక్రెట్ రూంలో వున్న అఖిల్ (Akhil Sarthak Vs Avinash Ariyana Glory), కంటెస్టెంట్స్ కన్ఫెషన్ రూంలోకి వచ్చి చెప్పే సీక్రెట్స్‌ని గమనించి, తాను ఇవ్వదలచుకుంటే ఆయా కంటెస్టెంట్స్‌కి లెటర్స్ పంపించొచ్చు.
లేకపోతే, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసెయ్యొచ్చు. అలా ముక్కలుగా మారిన లెటర్స్‌ని మళ్ళీ కంటెస్టెంట్స్‌కి బిగ్‌బాస్ పంపించాడు. దీన్ని టాస్క్ అనాలా.? ఇంకేమన్నా అనాలా.? ఎవరేమనుకున్నాసరే, ఇక్కడ అఖిల్ విజ్ఞత ప్రదర్శించి వుండాలి.
Also Read: సీక్రెట్ రూంలో అఖిల్.. అసలు స్కెచ్ అదేనా.?
తన స్నేహితులైన మెహబూబ్, సోహెల్‌లకు లెటర్స్ పంపించుకున్నాడు. మోనాల్ గజ్జర్ సంగతి సరే సరి. ఆమె చెప్పింది సిల్లీ సీక్రెట్ అయినా, అఖిల్ కరిగిపోయాడు. అబిజీత్‌కీ లెటర్ పంపాడు. హారిక, లాస్యలకూ లెటర్స్ వెళ్ళాయి.
కానీ, అవినాష్‌తోపాటు అరియానా మాత్రం లేఖలు అందుకోలేకపోయారు.. ముక్కలు ముక్కలుగా మారిపోయిన లేఖలు మాత్రమే వారికి దక్కాయి. అఖిల్, వారికి లేఖలు పంపేందుకు ఇష్టపడలేదు. నిజానికి, ఇది మనసుతో ఆలోచించాల్సిన విషయం.
చాలా రోజులపాటు తమ తమ కుటుంబాలకు దూరమైన కంటెస్టెంట్స్, కుటుంబ సభ్యుల నుంచి వచ్చే లేఖ కోసం ఎంత ఎమోషనల్‌గా ఎదురుచూస్తారు.? చీటికీ మాటికీ ఏడ్చేసే అఖిల్, అసలు కోణమేంటో ఇప్పుడు అందరికీ అర్థమయిపోయింది.
అవినాష్ చెప్పిన సీక్రెట్, అంతకు ముందే అఖిల్‌కి తెలుసుట. అరియానా అప్పటిదాకా ఎవరికీ చెప్పని యాక్సిడెంట్ సీక్రెట్ చెబితే, దాన్నసలు సీక్రెట్ అనే అనుకోలేదు అఖిల్. ఇక్కడ మేటర్ క్లియర్.. అఖిల్, పక్షపాతం చూపించాడు.
అవినాష్ ఎంతలా బాధపడ్డాడో సీక్రెట్ రూం నుంచి అఖిల్ చూశాడు.. అది చూసి పైశాచిక ఆనందాన్ని పొంది వుండకపోతే, అరియానాకి అయినా ఎందుకు లెటర్ పంపించలేదు.? ఈ ఒక్క టాస్క్, అఖిల్ (Akhil Sarthak Vs Avinash Ariyana Glory) రియల్ క్యారెక్టర్‌ని రియలిస్టిక్‌గా చూపించేసింది.
అంతిమంగా ఇది ఓ ఆట మాత్రమే అయినా, ఆడియన్స్ మాత్రం, అఖిల్ చర్యలతో అస్సలేమాత్రం ఏకీభవించలేకపోతున్నారు. ‘ప్లీజ్ బిగ్‌బాస్.. నాకు లెటర్ కావాలి..’ అని బిగ్‌బాస్‌ని అడుక్కునే నైతిక హక్కు అఖిల్‌కి వుందా అసలు.?