Kalvakuntla Kavitha Pink Politics.. గులాబీ పార్టీలో ముసలం.! కేటీయార్‌తో కవితకు పొసగని వైనం.! హరీష్ – కేటీయార్ మధ్య పంచాయితీ.! కుటుంబంలో లొల్లి, ‘కారు’ పార్టీలో గందరగోళం.!
కొత్త కథేమీ కాదు.! పాత కథే.! తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ నడుస్తున్న పంచాయితీనే ఇది.! అబ్బే, ఏం లేదు.. అని బుకాయింపులు చూస్తూ వచ్చాం.
కేటీయార్ – హరీష్ రావు కలిసి పని చేశారు. కవిత కూడా, అన్న కేటీయార్‌తో సర్దుకుపోవడమూ చూశాం.! కానీ, ఇప్పుడు రోజులు మారాయి.
Kalvakuntla Kavitha Pink Politics.. లోక్ సభ ఎన్నికల్లో ‘గుండు సున్నా’ తర్వాత..
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. వరుసగా రెండు సార్లు అధికార పీఠమెక్కిన గులాబీ పార్టీ, మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో మాత్రం, ‘గుండు సున్నా’కే పరిమితమైంది.
గెలుపోటములకు అతీతంగా పార్టీ పునర్నిర్మాణం జరిగి వుంటే, గులాబీ పార్టీకి ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదేమో.! కేసీయార్, షరామామూలుగానే ఫామ్ హౌస్‌కి పరిమితైపోయారు.
ప్రతిపక్ష నేత హోదాలో, అసెంబ్లీకి వెళ్ళి.. ప్రజా సమస్యలపై అధికార కాంగ్రెస్‌ని నిలదీయాల్సిన బాధ్యతను కేసీయార్ విస్మరించారు.

దాంతో, పార్టీ శ్రేణుల్లో కొంత గందరగోళం. ఇదే అదనుగా, కుమార్తె కవిత తన తండ్రి కేసీయార్‌కి లేఖాస్త్రం సంధించడం జరిగిపోయాయ్.
లేఖ రాసింది తానేననీ, అయితే ఆ లేఖను కుట్ర పూరితంగా బయటపెట్టారని కవిత ఆరోపిస్తున్నారు. కేసీయార్ కుట్ర పూరితంగా లేఖని బయట పెట్టారా.?
లేదంటే, లేఖను బయటపెట్టింది కేటీయార్ అని కవిత అనుమానమా.? హరీష్ రావు మీద కవితకు ఏమైనా అనుమానాలున్నాయా.?
Also Read: సమీక్ష ‘ఓదెల-2’: ఓటీటీలో ఉచితమే అయినా, టైమ్ వేస్ట్!
కేసీయార్ దేవుడేనని అంటున్నారు కవిత. అదే నిజమైతే, ఆమె చెబుతున్న దెయ్యాలు ఎవరు.? కేటీయార్, హరీష్ రావు.. ఈ ఇద్దరూ దెయ్యాలేనా.? చాలా ప్రశ్నలొస్తున్నాయ్.
కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది. ‘సీఎం కవిత..’ అంటూ ఆమె అనుచరులు చేస్తున్న నినాదాలకు అర్థం ఇదే.!
లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుని, అరెస్టయి.. జైలుకు వెళ్ళి, చాన్నాళ్ళ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కవిత ఆలోచనలు అనూహ్యంగా మారాయ్.
కొత్త రాజకీయ కుంపటి దిశగా కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు ప్రారంభించేశారా.? ఏమో, వేచి చూడాల్సిందే.