అఖిల్ సార్థక్ కోసం మోనాల్ గజ్జర్ (Akhil Sarthak Vs Monal Gajjar) త్యాగం చేసింది. అఖిల్‌కి బదులుగా తాను నామినేట్ అయ్యింది. నిజానికి ఆ సమయంలో అఖిల్ తన మీద తనకు నమ్మకం వుంటే, తన స్నేహితురాలైన మోనాల్ గజ్జర్‌ని సేవ్ చేస్తూ తాను నామినేట్ అయ్యేవాడు ఎలిమినేషన్ కోసం. అప్పుడే మేటర్ అందరికీ అర్థమయిపోయింది.
అది చాలక, ఇంకోసారి మోనాల్ గజ్జర్‌ని అఖిల్ నామినేట్ చేశాడు ఎలిమినేషన్ కోసం. పైగా, ‘నేను నామినేట్ చేయడం వల్లే మోనాల్ గజ్జర్ పట్టుదల పెంచుకుంది.. కసిగా ఆడుతోంది..’ అంటూ తొక్కలో స్టేట్‌మెంట్ ఒకటి పడేశాడు తాజాగా. ఇదెక్కడి ఈక్వేషన్.? తన మీద నెగెటివిటీ పెరిగిపోతోందని అనుకున్నాడో ఏమో, మోనాల్ గజ్జర్‌కి ఇమ్యూనిటీ ఇచ్చే అవకాశం వస్తే.. ఆ క్రమంలో తన వస్తువుల్ని త్యాగం చేసేశాడు.
అయితే, ఇక్కడ అఖిల్ త్యాగాన్ని ఎవరూ గుర్తించట్లేదు. అసలు అతను త్యాగం చేస్తేనే కదా, దాన్ని ఎవరైనా గుర్తించడానికి.? పాపం కడిగేసుకునే ప్రయత్నంలో ఓ చిన్న పబ్లిసిటీ స్టంట్ చేశాడంతే. మోనాల్ నీకు జస్ట్ స్నేహితురాలేనా.? అని అఖిల్‌ని హోస్ట్ నాగార్జున ప్రశ్నిస్తే, ‘జస్ట్ ఫ్రెండ్ అంతే..’ అని చెప్పేశాడు.
అంతకు ముందు మోనాల్ గజ్జర్, అఖిల్ గురించి మాట్లాడుతూ, ‘అఖిల్ మా ఫ్యామిలీ మెంబర్ లాంటోడు..’ అని చెప్పింది. ‘అఖిల్ నన్ను నామినేట్ చేస్తాడని కలలో కూడా అనుకోలేదు..’ అని మోనాల్ చెప్పింది. అయినాగానీ, అఖిల్ ‘వెలుగుతున్న దీపం’ అంటూ అఖిల్ పేరుని ప్రస్తావించింది.
అఖిల్ విషయంలో మోనాల్ క్లియర్‌గానే వుంది. అయితే, అది పాజిటివ్‌గా మాత్రమే. మోనాల్ విషయంలోనూ అఖిల్ క్లారిటీతో వున్నాడు.. నెగెటివ్ మైండ్‌సెట్‌తో. పైకి మాత్రం, మోనాల్ కోసం త్యాగం చేసేస్తున్నట్లు బిల్డప్. ఎటూ మోనాల్‌కి తన వల్ల ఇమ్యూనిటీ రాదని అర్థమయిపోయీ త్యాగం చేశాడంటే, మనోడి కామెడీ త్యాగం ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు మళ్ళీ మోనాల్, అఖిల్ త్యాగానికి చలించిపోతుంది.. అవకాశమొస్తే, అఖిల్‌ని (Akhil Sarthak Vs Monal Gajjar) సేవ్ చేస్తుంది. అదే, మోనాల్‌ని మాత్రం అఖిల్ ఇంకోసారి తన స్వార్ధం కోసం బలిపశువుని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.!