అప్పటిదాకా మెహబూబ్ దిల్ సేని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భావించిన సయ్యద్ సోహెల్, అనూహ్యంగా అఖిల్ సార్ధక్ (Akhil Sarthak Vs Monal Gajjar) వైపు టర్న్ తీసుకున్నాడు. పైగా, హౌస్‌లో అందర్నీ ఒప్పించేశాడు అఖిల్ సార్ధక్ ‘స్ట్రాంగ్ కంటెస్టెంట్’ అని.
‘స్ట్రాంగ్’ అనే పేరు చెప్పి, నన్ను బయటకు పంపించేయడానికి డిసైడ్ అయ్యారా.? అని అఖిల్ కూడా ప్రశ్నించాడు. కానీ, ఏం లాభం.? జరగాల్సింది జరిగిపోయింది. అయితే, ఈ మొత్తం కథ వెనుక పెద్ద స్కెచ్చే నడిసినట్లు కనిపిస్తోంది. అఖిల్ తిరిగొస్తాడని సోహెల్, మెహబూబ్ గట్టిగా నమ్మారు.
Also Read: అబిజీత్.. రియల్ బిగ్ హీరో ఆఫ్ ది సీజన్.!
పైకి ఏడుస్తున్నట్లు కనిపిస్తున్నా, మోనాల్ గజ్జర్‌కి కూడా అఖిల్ షో నుంచి ఔట్ అయిపోతాడన్న నమ్మకం లేదు. కానీ, ఆమె బీభత్సమైన యాక్టింగ్ చేసేస్తోంది. అరియానా, అవినాష్.. కొంత భిన్నమైన వైఖరి ప్రదర్శించారు అఖిల్ విషయంలో.
ఇక, స్నేహితుల్ని విడిచి వెళ్ళాల్సి వచ్చినందుకు అఖిల్ ఏమాత్రం బాధపడలేదు. పైగా, సీక్రెట్ రూంలో ఎంజాయ్ చేశాడు. ‘ఇక్కడి నుంచి చూస్తే, అన్ని విషయాలూ తెలుస్తాయి.. పిక్చర్ ఇంకాస్త క్లారిటీగా వుంటుంది..’ అంటూ పక్కా గేం ప్లేయర్ అవతారమెత్తాడు అఖిల్ సార్థక్.
నిజానికి, ఇలాంటి ఎపిసోడ్స్ గత సీజన్లలోనూ కనిపించాయి గనుక, అఖిల్ ఈ సమయంలో బయటకు వెళ్తాడని హౌస్‌లో ఎవరూ అనుకుని వుండరు. అఖిల్ కూడా తాను బయటకు వెళ్తానని అనుకోలేదు.. వెళ్ళలేదు కూడా.
‘స్ట్రాంగ్ కంటెస్టెంట్’ అయితే, ఎందుకు పంపించేస్తారు.? అన్న చిన్న లాజిక్ అందరికీ వుంటుంది కదా! సో, ఇదంతా పెద్ద డ్రామా అన్నమాట. ఆ డ్రామాలో అందరూ తమ తమ నటనా కౌశలంతో మెప్పించేశామనుకుంటున్నారు.
నటనలో ఆరితేరినవారి లిస్ట్‌లో మోనాల్ గజ్జర్‌కి ‘క్వీన్’ కి(Akhil Sarthak Vs Monal Gajjar) రీటం ఇచ్చెయ్యాలి. ఈ సీజన్‌కి సంబంధించినంతవరకు ఈ ఎపిసోడ్ మరో ఫ్లాప్ షో అని అనొచ్చేమో.!