Akkineni Naga Chaitanya Thandel తెలుగు సినిమా కథలు కొత్త పుంతలు తొక్కుతున్నాయ్.! పాన్ ఇండియా సబ్జెక్టులపైనే దర్శకులు వర్క్ చేస్తున్నారు.
తాజాగా, అక్కినేని నాగచైతన్య కొత్త సినిమాకి సైతం, పాన్ ఇండియా కాన్సెప్టునే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. చందూ మొండేటి దర్శకుడు.
అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమా పేరుని చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది.
Akkineni Naga Chaitanya Thandel.. తండేల్.. కథేంటి.?
ఉత్తరాంధ్రకి చెందిన మత్స్యకారుడు.. అనుకోని పరిస్థితుల్లో సముద్రంలో దారి తప్పి, పాకిస్తాన్ చేతికి చిక్కడం.. ఈ సినిమాలో కథాంశమట.
నిజంగానే జరిగిన ఓ సంఘటన ఆధారంగా, కమర్షియల్ హంగులు అద్ది, ప్రేమ అలాగే దేశభక్తి అంశాల్ని జోడించారట ఈ సినిమాకి.

సినిమా టైటిల్ ‘తండేల్’.! అసలు తండేల్ అంటే ఏంటి.? ఈ విషయమై నెటిజన్లు ఇంటర్నెట్‌తో తెగ వెతికేస్తున్నారు.
సాయి పల్లవితో ఇంకోసారి..
నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) – సాయి పల్లవి (Sai Pallavi) కాంబినేషన్‌లో వచ్చిన ‘లవ్ స్టోరీ’ మంచి విజయాన్ని అందుకుంది.
రెండోసారి ఈ జంట ‘తండేల్’ కోసం చేతులు కలిపింది. ‘లవ్ స్టోరీ’ని మించిన ఎమోషన్స్ ఈ ‘తండేల్’లో వుంటాయట. యాక్షన్ ఎపిసోడ్స్ ‘నభూతో న భవిష్యతి’ అనే స్థాయిలో వుంటాయట.
Also Read: డీప్ ఫేక్.! జారా పటేల్ శరీరం.. రష్మిక మండన్న తలకాయ్.!
అన్నట్టు, ఈ సినిమా కోసం.. కొన్ని నెలలపాటు అక్కినేని నాగచైతన్య, చందూ మొండేటి గ్రౌండ్ లెవల్‌లో చాలా చాలా వర్క్ చేశారు. చాలా ప్రాంతాలూ తిరిగారు.
మత్స్యకారుల జీవన విధానం, సముద్రంలో వారు పడే కష్టాల్ని స్వయంగా తెలుసుకున్నారు కూడా. నాగచైతన్య అయితే, కండలు తిరిగిన శరీరమే కాదు, బాగా పెరిగిన గడ్డంతో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు ఈ సినిమా కోసం.
చందూ మొండేటి, అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కాంబినేషన్‌లో గతంలో ‘ప్రేమమ్, ‘సవ్యసాచి’ చిత్రాలొచ్చాయి.