Virat Kohli.. అలక అమ్మాయిలకి అందమంటారు పెద్దలు. సరే, అందమా.. మందమా.. అన్నది వేరే చర్చ. ఇక్కడ విషయం భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి. కింగ్ కోహ్లీకీ అలకకీ లింకేంటీ.? ఇదే కదా మీ డౌట్. లింకుంది. విరాట్ కోహ్లీ అలక పాన్పు ఎక్కాడట. అందుకే టీ20 కెప్టెన్సీ వదులుకున్నాడట. ఇది పాత వాదనే.
కొత్త ప్రచారం ఏంటంటే, వన్డే కెప్టెన్సీని విరాట్ కోహ్లీ నుంచి బీసీసీఐ దూరం చేయడంతో తాజాగా కింగ్ కోహ్లీ మళ్లీ అలకపాన్పు ఎక్కాడట. టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాలనుకున్నాడట. అంతేనా.? రిటైర్మెంట్ కూడా ప్రకటించేస్తాడా.? ఏమో గుర్రం ఎగరా వచ్చు.
Virat Kohli అలా ఎందుకు చేస్తాడు.?
విరాట్ కోహ్లీ చుట్టూనే ఎందుకింతలా రచ్చ జరుగుతోందో ఎవరికీ అర్ధం కావడం లేదు. చాలా కాలం క్రితమే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. ధోనీ నుంచి కోహ్లీ కెప్టెన్సీ అందుకున్నాడు. ధోనీ తరహాలోనే టీమిండియాకి తన కెప్టెన్సీలో మంచి విజయాల్ని అందించాడు కోహ్లీ.

అయితే, సహచర ఆటగాళ్లతో మరీ ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో విరాట్ కోహ్లీకి గత కొంతకాలంగా పొసగడం లేదు. పైకి మాత్రం తమ మధ్య ఎలాంటి విబేధాలూ లేవనీ, ఇద్దరూ చెబుతున్నారు. కానీ, ఖచ్చితంగా సమస్య మాత్రం ఇద్దరి మధ్యా ఉంది.
రోహిత్ శర్మ మీద అక్కసుతోనేనా.?
ఎప్పుడయితే, కోహ్లీ నుంచి కెప్టెన్సీ రోహిత్ శర్మ దగ్గరకు వచ్చిందో.. సీన్ మొత్తం మారిపోయింది. కోహ్లీ అభిమానులు రోహిత్ శర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రోహిత్ శర్మ మాత్రం జట్టులో విరాట్ కోహ్లీ విలువైన ఆటగాడనీ, కోహ్లీ కెప్టెన్సీలో ఎన్నో విజయాలను సాధించామనీ, అతని పట్ల గౌరవ భావం ఉందనీ అంటున్నాడు.
Also Read: కెప్టెన్ కోహ్లీ తప్పుకున్నాడా.? తప్పించేశారా.?
ఆల్ ఈజ్ వెల్ అయితే, ఈ గలాటా ఎందుకు చోటు చేసుకుంటోంది.? బీసీసీఐ అలాగే మాజీ క్రికెటర్లు ఎందుకు అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే, విరాట్ కోహ్లీ (Virat Kohli) అలక పాన్పు ఎక్కడం సమంజసమేనేమో అనిపిస్తోంది. కానీ, దాని వల్ల లాభమేంటీ.?