Akkineni Nagarjuna 100 Tabu.. అక్కినేని నాగార్జున అభిమానులకి ‘నిన్నే పెళ్ళాడతా’ వెరీ వెరీ స్పెషల్ మూవీ.
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అది. నాగార్జున సరసన టబు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. సెన్సేషనల్ హిట్ సినిమా అప్పట్లో ‘నిన్నే పెళ్ళాడతా’.!
ఆ కామెడీ, ఆ పాటలు.. సినిమాలో లీడ్ పెయిర్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ.. దేనికదే ప్రత్యేకం ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాలో.!
Akkineni Nagarjuna 100 Tabu.. ఆవిడా.. మా ఆవిడే.!
‘నిన్నే పెళ్ళాడతా’ తర్వాత ‘ఆవిడా మా ఆవిడే’ సినిమా కోసం అక్కినేని నాగార్జు, టబు జత కట్టారు. అయితే, ఆ సినిమా జస్ట్ ఫర్వాలేదనిపించిందంతే.
టబు, తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరితోనూ నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా టాప్ ఫోర్ హీరోలతో సినిమాలు చేసిన టబు, గత కొన్నాళ్ళుగా తెలుగు తెరకు దూరంగా వుంది.
ఆ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘అల వైకుంటపురములో’ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
నాగార్జున వందో చిత్రంలో..
అక్కినేని నాగార్జున, తన వందో చిత్రాన్ని ఇటీవల స్టార్ట్ చేశాడు. పెద్దగా హడావిడి లేకుండా, పూజా కార్యక్రమాలతో నాగార్జున వందో చిత్రం ప్రారంభమైంది.
ఆ వందో సినిమాకే, టబుని తీసుకున్నాడట అక్కినేని నాగార్జున. హీరోయిన్ కాదుగానీ, ఓ ఇంట్రెస్టింగ్ రోల్ టబు ఈ సినిమాలో చేయబోతోందని తెలుస్తోంది.
Also Read: డాలర్ డ్రీమ్స్ వద్దే వద్దు.! మన భారతమే ముద్దు.!
అయితే, ప్రస్తుతానికి ఇది గాసిప్ మాత్రమే. చిత్ర యూనిట్ ఈ విషయమై అధికారిక ప్రకటన చేయాల్సి వుంది.
వందో సినిమా కదా.. నాగ్ – టబు కాంబినేషన్.. అంటే, దానికి వేరే రేంజ్ హైప్ క్రియేట్ అవుతుంది. నాగ్, టబు.. ఇద్దరూ కో-స్టార్స్ మాత్రమే కాదు, మంచి మిత్రులు కూడా.
ఈ ఇద్దరి చుట్టూ గాసిప్స్ అంటారా.. అవి మామూలే.!
