Table of Contents
Pawan Kalyan Roja EVM.. వరుసగా రెండు సార్లు ఓడి, ఆ తర్వాత రెండు సార్లు వరుసగా గెలిచి, ఆ తర్వాత మళ్ళీ ఓడిపోయారు వైసీపీ నేత రోజా.!
రెండు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రోజా, వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచారు, ఓ సారి ఓడిపోయారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓడిందీ ఈవీఎం ద్వారా జరిగిన ఎన్నికల్లోనే, గెలిచిందీ ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లోనే.
Pawan Kalyan Roja EVM.. అది రైటయితే, ఇదీ రైటే.!
వరుసగా రెండు సార్లు ఓడిన రోజా, వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు.. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్, తర్వాతి ఎన్నికల్లో గెలవడం తప్పెలా అవుతుంది.?
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘డైమండ్ రాణి’ అంటూ సెటైర్లు వేశారు. అంతకు ముందు రోజా, పవన్ కళ్యాణ్ మీద ‘ప్యాకేజీ స్టార్’ అంటూ విమర్శలు చేశారు.

రాజకీయాల్లో గెలుపోటములు, రాజకీయ విమర్శలూ మామూలే. రాజకీయ ప్రత్యర్థులు గనుక, రాజకీయ విమర్శలు, సెటైర్లు వేసుకోవడంలో వింతేమీ లేదు.
ఓడి, గెలిచి, మళ్ళీ ఓడిన రోజా..
కాకపోతే, ‘ఈవీఎం ద్వారా గెలిచారు’ అంటూ పవన్ కళ్యాణ్ మీద రోజా కామెంట్లు చేయడమే హాస్యాస్పదం. ‘ప్రజలు ఓట్లేసి గెలవలేదు’ అంటూ పవన్ కళ్యాణ్ మీద రోజా విమర్శలు చేస్తున్నారు.
చంద్రగిరి, నగిరి నియోజకవర్గాల నుంచి రోజా ఎన్నికల బరిలో నిలిచారు. చంద్రగిరిలో ఓడారు.. నగిరిలో నెగ్గారు. నగిరిలోనూ ఓడారామె.
పవన్ కళ్యాణ్, 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు, 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
100 శాతం స్ట్రైక్ రేట్..
పవన్ కళ్యాణ్, తాను గెలవడమే కాకుండా, తన పార్టీ నుంచి మరో 20 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ఇద్దర్ని ఎంపీలుగా గెలిపించారు.
100 పర్సంట్ స్ట్రైక్ రేట్‌తో జనసేన బంపర్ విక్టరీ కొట్టింది 2024 ఎన్నికల్లో. ఇది అపూర్వ విజయం. 2019లో జనసేన ఓడిపోయింది కాబట్టి, 2024లో గెలిస్తే, అది ఈవీఎం గెలుపు ఎలా అవుతుంది.?
Also Read: రాజకీయోన్మాదం: ఎవర్ని, ఎందుకు ‘రప్పా.. రప్పా..’ నరుకుతారు.?
ఆ లెక్కన, వరుసగా రెండు సార్లు ఓడిన రోజా, రెండు సార్లు వరుసగా గెలవడం కూడా ఈవీఎం గెలుపు అవుతుంది కదా.? లాజిక్ లేకుండా, నోటొకిచ్చింది వాగడం రోజాకి వెన్నతో పెట్టిన విద్య.