అలేఖ్య హారిక అలియాస్ డేత్తడి హారిక, అబిజీత్.. ఈ ఇద్దరు బిగ్‌హౌస్‌లో ఇంగ్లీషుని ‘అత్యధికంగా’ వాడేస్తుంటారు (Alekhya Harika & Abijeet Warned). ఆ మాటకొస్తే, ఏ రోజు ఫుటేజ్ తీసినా.. అందులో వీళ్ళిద్దరూ తెలుగులో మాట్లాడిన పదాల్ని వెతుక్కోవాలేమో.! ఈ రోజుల్లో తెలుగుని ఇంగ్లీషు డామినేట్ చేయడం వింతేమీ కాదు.
అయితే, అదే బిగ్‌హౌస్‌లో మోనాల్ గజ్జర్ బాగానే తెలుగులో మాట్లాడేస్తోంది. నిజానికి, మోనాల్ గజ్జర్ తెలుగమ్మాయి కాదు. అలేఖ్య హారిక, అబిజీత్.. ఈ ఇద్దరూ తెలుగోళ్ళే. ఇదే విషయాన్ని కింగ్ అక్కినేని నాగార్జున ‘పాయింట్ ఔట్’ చేశాడు.
‘తెలుగులో మాట్లాడండి మొర్రో..’ అని బిగ్‌బాస్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినాగానీ, మార్పు రాలేదు. అలా మార్పు ఎందుకు వస్తుంది.? పనిష్మెంట్ అనేది కాస్త గట్టిగానే వుండాలేమో. ‘సారీ సర్.. నెక్స్ టైం ఈ పొరపాటు జరగదు..’ అని అలేఖ్య, అబిజీత్ హామీ ఇచ్చారుగానీ.. అదంత తేలికైన వ్యవహారం కాదు.
హౌస్‌లో చాలామంది ఇంగ్లీషులో మాట్లాడగలరు. కానీ, అలేఖ్య – అబిజీత్ మాత్రమే ఎందుకు ‘ఇంగ్లీషు’కి అడిక్ట్ అయిపోయినట్లుగా మాట్లాడుతున్నారన్నది ఇక్కడ సీరియస్ క్వశ్చన్. అలా అబిజీత్, అలేఖ్య.. ఇంగ్లీషులోనే మాట్లాడటం వారికే మైనస్. ఎందుకంటే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చాలామందికి అర్థం కాకపోతే, ఆ ఇద్దర్నీ ఆడియన్‌స అపార్థం చేసుకునే అవకాశం వుంటుంది.
ఈ విషయాన్ని ఓ స్వీట్ వార్నింగ్ తరహాలో అలేఖ్య, అబిజీత్‌లకు బిగ్ హోస్ట్ నాగార్జున సవివరంగా తెలియజెప్పడం గమనార్హం. హౌస్‌కి సంబంధించినంతవరకు అబిజీత్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కి ‘ఇంగ్లీషు’ అనేది వీక్ పాయింట్ అవడం అస్సలేమాత్రం సబబుగా లేదు. అలేఖ్య హారికకి కూడా ఇది వర్తిస్తుంది.
చాలా విషయాల్లో కాన్ఫిడెంట్‌గా కనిపించే అలేఖ్యకి, ఇంగ్లీషులో కాన్పిÛడెంట్ మాత్రం మైనస్‌గా మారుతోంది. తెలుగులో మాట్లాడకపోతే ‘డైరెక్ట్ ఎలిమినేషన్’ అని బిగ్‌బాస్ హెచ్చరించేదాకా ఈ ఇద్దరే కాదు, హౌస్‌లో ఇంగ్లీషు పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్న (Alekhya Harika & Abijeet Warned) ఇతర కంటెస్టెంట్లూ రానిస్తారంటారా.?