పిట్ట కొంచెం కూత ఘనం.. అన్న మాట బహుశా అలేఖ్య హారిక అలియాస్ ‘డేత్తడి’ హారికకి (Alekhya Harika Dethadi Entertainment) పెర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుందేమో. బిగ్‌బాస్ తెలుగు సీజన్ ఫోర్‌లో హాటెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్‌గా ఇప్పటికే బుల్లితెర వీక్షకుల దృష్టిని ఆకర్షించిన అలేఖ్య హారిక, తాజా ఎపిసోడ్‌లో దుమ్ము రేపేసింది.
మామూలుగా ‘వన్ మ్యాన్ షో’ అంటుంటాం. ఇక్కడ అలేఖ్య ‘డేత్తడి’ షో’.. అనాలేమో. ఆ స్థాయిలో ఎంటర్‌టైన్ చేసింది. స్టార్టింగ్ టు ఎండింగ్.. దుమ్ము రేపేసింది. ఒకరోజంతా బిగ్‌బాస్ కేవలం అలేఖ్య హారికనే హైలైట్ చేయాలనుకున్నాడేమో అన్పించింది.
అభిజిత్‌తో రొమాంటిక్ టచ్‌తో మొదలైన అలేఖ్య హారిక జోష్, ఆ తర్వాత సోలో పెర్పాÛమెన్స్‌తో పీక్స్‌కి వెళ్ళింది. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ అంటూ ‘పోకిరి’ సినిమా కోసం ముమైత్‌ఖాన్ చిందేసిన స్పెషల్ సాంగ్‌ని అలేఖ్య హారిక పెర్ఫామ్ చేసింది.
మిగతా కంటెస్టెంట్స్ పాట పాడుతోంటే, హారిక చేసిన డాన్స్ సింప్లీ సూపర్బ్. ర్యాంప్ వాక్, ర్యాప్ సాంగ్.. ఇలా అన్నిట్లోనూ అదరగొట్టేసింది అలేఖ్య హారిక. అక్కడితో సినిమా అయిపోలేదు. ఆ తర్వాత, బిగ్‌బాస్ ఓ ‘టీవీ సీరియల్’ లాంటి స్కిట్ ఇస్తే, అందులో ప్రకటనల ఎపిసోడ్‌కి అలేఖ్య హారిక తనదైన ‘పవర్‌ఫుల్ టచ్’ ఇచ్చింది.
ఆ స్కిట్‌లో గంగవ్వ ఎనర్జీ ఓ ఎత్తు, నోయెల్ ఎనర్జీ ఇంకో ఎత్తు. వీటన్నిటికీ మించి హారిక అప్పీయరెన్స్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది. అన్నట్టు, ఈ వారం ఎలిమినేషన్ కోసం హారిక కూడా నామినేట్ అయిన విషయం విదితమే. దాంతో, హారిక అభిమానులు ఆమెను సేవ్ చేయడమే కాదు, భారీ ఓట్లతో సత్తా చాటేందుకు తమవంతు కృషి చేస్తున్నారు.
ఏదిఏమైనా, ఈ ఎపిసోడ్‌తో అలేఖ్య హారిక, టాప్ ఫైవ్‌లో ఖచ్చితంగా వుండే కంటెస్టెంట్ అని చాలామందికి క్లారిటీ వచ్చేసింది. ఒక్క రోజు అని కాదు, ప్రతిరోజూ ఎక్కడా ఎనర్జీ డ్రాప్ అవకుండా ఎంటర్‌టైన్ చేస్తోన్న హారిక, టైటిల్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.!
చాలా షార్ట్ ఫిలింస్ చేసేసిన హారిక (Alekhya Harika Dethadi Entertainment), అందులో చాలా వరకు సోలో పెర్ఫామెన్స్‌తోనే ఆకట్టుకుంది. అదిప్పుడు బిగ్‌హౌస్‌లో ఆమెకు బాగా పనికొస్తున్నట్టుంది. ఇప్పటివరకు హారిక విషయంలో హౌస్‌లో ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకపోవడం ఆమెకు మరో ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.