Table of Contents
Alia Bhatt In Tollywood.. ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినీ పరిశ్రమని లైట్ తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్ల గురించి మాట్లాడుకోవల్సి వస్తే, దిశా పటానీ, కంగనా రనౌత్, శ్రద్ధా కపూర్.. ఇలా ఈ లిస్టు కాస్త గట్టిగానే వుంటుంది. అలియా భట్ కూడా ఆ బాపతేనా.? అని అంతా అనుకున్నారు. కానీ, ఆమె చాలా చాలా తెలివైనదే.
చాన్నాళ్ల క్రితం ఓ హిందీ సినిమా ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీయార్ అంటే తనకు ఇష్టమనీ, ఆయనతో కలిసి ఓ సినిమా చేయాలని వుందనీ, తనంతట తానుగా చెప్పింది అలియాభట్.
అలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి వచ్చిన అలియా భట్.!
అనూహ్యంగా ఆమెకు ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఆ అవకాశమిచ్చాడు దర్శకుడు రాజమౌళి. సరే, చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్.. ఎన్టీయార్‌కి ఒలివియా మోరిస్ పాట్నర్ అనుకోండి. అది వేరే సంగతి.
ఇదిలా వుంటే, కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీయార్ హీరోగా తెరకెక్కనున్నసినిమాలో అలియా భట్ హీరోయిన్‌గా నటించనుంది. దీంతో పాటు మరో ప్రతిష్ఠాత్మక తెలుగు సినిమా కోసం అలియా భట్ పేరును పరిశీలిస్తున్నారు.
Alia Bhatt In Tollywood.. టాలీవుడ్ మీద మమకారం ఎక్కువయ్యిందే.!
తాజాగా ఓ సందర్భంలో అలియా భట్, టాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. ఒక్క సినిమాతో తెలుగు సినిమా తెరపై నుంచి మాయమైపోవాలని తానెప్పుడూ అనుకోలేదని చెప్పింది.

నటనకు భాష అడ్డంకి కాదనీ, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు వారి ఆదరాభిమానాల్ని అందుకునేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకునేంత తప్పు తానెప్పుడూ చేయననీ.. చెప్పుకొచ్చింది సొట్ట బుగ్గల సుందరి అలియా భట్.
రెమ్యునరేషన్ వంక పెట్టో, ఇంకో కుంటి సాకు చెప్పో.. తెలుగు సినిమాలు లైట్ తీసుకునే సో కాల్డ్ బాలీవుడ్ నటీమణులు కొందరు అలియా భట్‌ని చూసి చాలా నేర్చుకోవాలి.
అలియా భట్ అలా.. వీళ్ళేమో ఇంకోలా.!
అన్నట్టు దిశా పటానీ (Disha Patani) తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. అసలు తెలుగు సినిమా వైపు ఆ తర్వాత కన్నెత్తి కూడా చూడలేదు దిశా పటానీ.
కంగనా రనౌత్ (Kangana Ranaut) విషయానికొస్తే, ఆమె కూడా పూరి జగన్నాథ్ రూపొందించిన ‘ఏక్ నిరంజన్’ సినిమా తర్వాత తెలుగు సినిమాల్ని పట్టించుకోలేదు. ‘ఏక్ నిరంజన్’ సినిమాలో ప్రభాస్ హీరో.
Also Read: కీర్తి సురేష్ ఐరెన్ లెగ్గు స్టోరీ: ఊ! అంటారా.?
శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కూడా ప్రభాస్ సరసన నటించింది ‘సాహో’ సినిమాలో. ఆ తర్వాత ఆమెని టాలీవుడ్ పట్టించుకోలేదనుకోండి.. అది వేరే సంగతి.
అంతా బాగానే వుందిగానీ, అలియా భట్ విషయంలో ‘రెమ్యునరేషన్ గాసిప్స్’ ఎందుకు ఎక్కువగా వినిపిస్తున్నట్లు.? తెలుగు సినిమా చేయడానికి రికార్డు స్థాయిలో ఆమె రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందనీ, ఆమె పేరు చెబితేనే కొందరు నిర్మాతలు హడలిపోతున్నారనీ గాసిప్స్ ఎలా పుట్టుకొస్తున్నయాట.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది కదా.! పైగా, సినిమా ప్రమోషన్ల కోసం అలియా చాలా చాలా కష్టపడుతుంది గనుక, ఆ కష్టానికి తగ్గట్టుగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే, అందులో తప్పేముందట.?