ఓ పెళ్ళి వేడుకల ప్రత్యేక వస్త దుకాణం ప్రకటన కోసం ‘కన్యాదానం’ అనే సంప్రదాయాన్ని తప్పు పడుతూ ‘క్రియేటివిటీ’ ప్రదర్శించారు. కన్యాదానం నేరమా.? ఇందులో స్త్రీ పురుష సమానత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి.? కన్యాదాన్ కాదు.. కన్యా మాన్.. ప్రముఖ సినీ నటి అలియా భట్ (Alia Bhatt Kanya Daan) ఆ ప్రకటనలో ధీశాలిగా ప్రకటించేస్తుంది.
నిజానికి ఇది జస్ట్ ఓ పబ్లిసిటీ స్టంట్. తమ వస్త్రాల బ్రాండ్ ప్రమోషన్ కోసం ఈ ప్రకటన చేయించారు. క్రియేటివ్ డైరెక్టరెవడో తన క్రియేటివిటీనంతా రంగరించి దీన్ని రూపొందించాడు. ‘డబ్బులు పారేస్తే ఎలాంటి గడ్డి తినడానికైనా సిద్ధమే.. అనే రీతిలో ముందూ వెనుకా చూసుకోకుండా నటించేసే కొందరు సెలబ్రిటీలు..’ అని అనలేంగానీ, అలియా భట్ మాత్రం, ఈ ప్రకటనలో నటించి అందర్నీ విస్మయానికి గురిచేసింది.
Also Read: డేటింగుల్లోనూ పొట్టీ.. పొడుగూ.!
ఆ ప్రకటన ఎంత వివాదాస్పదమవుతుందో అలియా భట్‌కి తెలుసు. ఆ ప్రకటన ఎంత వివాదాస్పదమైతే ఎంత పబ్లిసిటీ వస్తుందో.. సదరు సంస్థకి తెలుసు. ఎలా ప్రకటనను వివాదాస్పదంగా తిర్చిదిద్దాలో తెలుసుకునే దర్శకుడు ఈ ప్రకటననీ రూపొందించాడు.
ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇలాంటి సందర్భాల్లో ప్రకటనలోని వివాదాస్పద అంశాల్ని, సదరు సంస్థలు.. లేదా సదరు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ప్రచారంలోకి తెచ్చేందుకు అదనపు ఎఫర్ట్స్ పెడుతుంటారు.. కొందర్ని వారే సోషల్ మీడియాలో ఉసిగొల్పుతుంటారు. పాజిటివ్ పబ్లిసిటీ కంటే నెగెటివ్ పబ్లిసిటీకి వచ్చే ఇంపాక్ట్ ఎక్కువ వుంటుంది మరి.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!
అంతా బాగానే వుందిగానీ.. హిందూ మత సంప్రదాల మీదనే ‘దాడి’ తరహాలో ఇలాంటి ప్రకటనలు ఎందుకు రూపొందుతుంటాయ్.? ఇదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు.. అలా చేయడం వెనుక అసలు కోణం.. (Alia Bhatt Kanya Daan) హిందూ సమాజం.. చాలామందికి సాఫ్ట్ టార్గెట్ అంతే.